తెలంగాణలో పొత్తు పొడిచేనా..?

Telangana: చివరి క్షణంలో పొత్తులపై చర్చించాలన్న యోచనలో కాంగ్రెస్

Update: 2023-08-29 11:22 GMT

తెలంగాణలో పొత్తు పొడిచేనా..?    

Telangana: తెలంగాణలో పొత్తు పొడిచేనా..? కాంగ్రెస్, వామపక్షాల మధ్య సీట్ల సర్ధుబాటు జరిగేనా.? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఇంకాస్త టైం పట్టేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ వైపు వామపక్షాలు చూస్తున్నా... సీట్లపై చర్చించేందుకు ఇంకాస్త సమయం తీసుకుందామన్న యోచనలో గాంధీ భవన్ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తుల అంశంపై పార్టీలో సమాలోచనలు జరుపుతున్నా.. ఇంకా వామపక్షాలతో జరపలేదని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ఇటు వామపక్ష నేతలు మాత్రం తాము నియోజకవర్గాల ప్రతిపాదన పంపించామని నిర్ణయం కాంగ్రెస్ చేతిలోనే ఉందని అంటున్నారు. సీట్ల సర్ధుబాటుకు ఒప్పుకుంటేనే చర్చలు జరుపుతామని చెబుతున్నారు.

పొత్తుతో సీట్లు రాబట్టాలని వాపక్షాల వ్యూహాలు రచిస్తుంటే... పొత్తు పెట్టుకుంటే తామే నష్టపోతామనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాని కాంగ్రెస్‌లోని కొందరి నేతలు వాదన మాత్రం భిన్నంగా ఉంది. పొత్తుల ప్రసక్తే కాంగ్రెస్ నేత పొన్నం తేల్చి చెప్పారు. పొత్తులతో తమ పార్టీ కేడర్‌ను కోల్పోతుందని హస్తం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొత్తుతో పార్టీకి లాభం లేదన్న భావనలో కాంగ్రెస్ సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అధికార బీఆర్ఎస్ వామపక్షాలను కాంగ్రెస్‌పైకి... ఉసిగొల్పుతున్నారని మరికొందరు కాంగ్రెస్ నేతల ఆరోపిస్తున్నారు. 2014లో కాంగ్రెస్‌తో పొత్తుకు వెళ్లి వాపక్షాలు ఒక సీటు గెలిచాయి. ఎన్నికల తర్వాత గెలిచిన ఒక్క సీపీఐ ఎమ్మెల్యే బీఆర్ఎస్‌లో చేరారు. పొత్తులో దేవరకొండను త్యాగం చేస్తే అధికారపార్టీలోకి వెళ్లారని అపవాదు ఉంది. ప్రస్తుతం ఎక్కువ సీట్లు అడుగుతున్న నేపథ్యంలో.. గెలిచిన తర్వాత అధికార పార్టీకి అనుకూలించే పరిస్థితి ఉందన్న భావనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌పై ఆశలు పెట్టు్కున్నా చర్చలు లేకుండానే కేసీఆర్ సీట్లు ప్రకటించడంతో వామపక్షాలు గుర్రుగా ఉన్నారు.

మొత్తంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని సీట్లు సంపాదించాలన్న యోచనలో వాపక్షాలు ఉన్నా... చివరి క్షణంలో పొత్తులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. 

Tags:    

Similar News