ఆర్మూర్ ఎమ్మెల్యేపై బెదిరింపు ఆరోపణలు
Jeevan Reddy: నిరుద్యోగభృతి అడిగినందుకే తనను బెదిరించారంటున్న మహేష్
ఆర్మూర్ ఎమ్మెల్యేపై బెదిరింపు ఆరోపణలు
Jeevan Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను బెదిరించారంటూ.. నిజామాబాద్ జిల్లా రామచంద్రపల్లికి చెందిన మహేష్ అనే వ్యక్తి ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో భాగంగా గ్రామానికి వచ్చిన జీవన్ రెడ్డి.. తనను దగ్గరికి పిలిచి చంపేస్తానంటూ చెవిలో చెప్పారని మహేష్ ఆరోపించారు. నిరుద్యోగభృతి ఇప్పించాలని అడిగినందుకే తనను బెదిరించారని తెలిపాడు. జీవన్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడనని.. ఆయనతో బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పాడు.