Actress Hema: మరో వీడియో వదిలిన నటి హేమ.. ఈసారి ఇలా..

Actress Hema: ఇన్‌స్టాలో చికెన్ ధమ్ బిర్యానీ రెసీపీ వీడియో పోస్ట్ చేసిన హేమ

Update: 2024-05-21 11:47 GMT

Actress Hema: మరో వీడియో వదిలిన నటి హేమ.. ఈసారి ఇలా..

Actress Hema: టాలీవుడ్ సినీ నటి హేమ చికెన్ బిర్యానీ తయారు చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగుళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమ పేరు ప్రచారంలోకి వచ్చింది.అయితే తాను ఈ పార్టీలో పాల్గొనలేదని హేమ ఓ వీడియోను విడుదల చేశారు. తాను బెంగుళూరులో లేనని హైద్రాబాద్ లోని ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా హేమ ఆ వీడియోలో పేర్కొన్నారు. చికెన్ ధమ్ బిర్యానీ తయారీ గురించి హేమ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కవరింగ్ ఎందుకు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

బెంగుళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది.ఆదివారం నాడు సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ కు చెందిన వ్యాపారి తన బర్త్ డే సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారని ప్రచారం సాగుతుంది.కన్నడ సీరియల్ నటులతో పాటు కొందరు తెలుగు టీవీ నటులు, మోడల్స్ కూడ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: రేవ్ పార్టీ అంటే ఏంటి?

Also Read: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో కీలక విషయాలు

Tags:    

Similar News