Jagtial: జగిత్యాలలో యువకుడు దారుణ హత్య

Jagtial: నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు

Update: 2023-08-21 04:25 GMT

Jagtial: జగిత్యాలలో యువకుడు దారుణ హత్య

Jagtial: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అర్ధరాత్రి యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. పట్టణ శివారులోని ఓ బారు సమీపంలో యువకుడిని దుండగులు ఇటుకలతో కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన కన్నం సతీష్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. గత కొద్దిరోజులుగా కోరుట్ల నియోజకవర్గంలో వరుస హత్యలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News