2 Headed Snake: భద్రాద్రి జిల్లా గొంపల్లిలో కనిపించిన రెండు తలల పాము

2 Headed Snake: ఇందిరా రిజర్వు ఫారెస్టులో వదిలిపెట్టిన అటవీశాఖ సిబ్బంది

Update: 2023-09-02 11:37 GMT

2 Headed Snake: భద్రాద్రి జిల్లా గొంపల్లిలో కనిపించిన రెండు తలల పాము

2 Headed Snake: భద్రాద్రి జిల్లా చర్ల మండలం గొంపల్లిలోని గండూరి శ్రీను ఇంట్లో సుమారు 5 కేజీల బరువున్న రెండు తలల పాము కనపడింది. దీంతో అతడు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉపేందర్ ఆదేశాలతో బీట్ ఆఫీసర్ కోర్స శ్రీరాములు చర్ల సెక్షన్ బేస్ క్యాంపు సిబ్బందితో కలిసి... ఆ రెండు తలల పామును ఇందిరా రిజర్వ్ ఫారెస్టులో విడిచిపెట్టారు. రెండు తలల పాముతో సిరి కలిసి వస్తుందని అపోహలున్న నేపథ్యంలో ఆ పాముకు బహిరంగ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కానీ పాముకు ఎటువంటి హాని తలపెట్టకుండా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన గండూరి శ్రీనును గొంపల్లి గ్రామస్తులు, ఫారెస్ట్ అధికారులు అభినందించారు.

Tags:    

Similar News