Medak: మెదక్‌ జిల్లా టేక్మల్‌లో కారు దగ్ధం కేసులో ట్విస్ట్

Medak: చనిపోయాడనుకున్న ధర్మానాయక్ సురక్షితం

Update: 2023-01-17 07:00 GMT

Medak: మెదక్‌ జిల్లా టేక్మల్‌లో కారు దగ్ధం కేసులో ట్విస్ట్

Medak: మెదక్ జిల్లా టేక్మల్ లో కారు దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. చనిపోయాడనుకున్న ధర్మానాయక్ సురక్షితంగానే ఉన్నాడు. అయితే.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ ను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. తానే చనిపోయినట్టు చిత్రీకరించేందుకు ధర్మా ప్లాన్ చేశాడు. ఈ నెల 9న కారులో ప్రమాదవశాత్తు చనిపోయినట్లు నాటకం ఆడాడు. ప్రమాదస్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు కేసును ఛేదించారు. బెట్టింగ్ లతో భారీగా అప్పులపాలైన ధర్మా.. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని పన్నాగం పన్నాడు. ధర్మాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News