Mahabubabad: రోడ్డుపక్క పొదల్లోకి దూసుకువెళ్లిన స్కూలు బస్సు.. భయంతో కేకలు వేసిన విద్యార్థులు
Mahabubabad: ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది పిల్లలు
Mahabubabad: రోడ్డుపక్క పొదల్లోకి దూసుకువెళ్లిన స్కూలు బస్సు.. భయంతో కేకలు వేసిన విద్యార్థులు
Mahabubabad: మాహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి స్టేజి దగ్గర స్కూలు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. రామగిరి నుంచి నెళ్లికుదురు వెళుతున్న శ్రీ సాయి పబ్లిక్ స్కూలు బస్సు అతివేగంతో మూలమలుపు తిరగలేక రోడ్డుపక్కన ఉన్న పొదల్లోకి దూసుకువెళ్లింది. దీంతో పిల్లలు భయంతో కేకలు వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.