Thondapalli: టోల్ ప్లాజా సమీపంలో కారులో మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్.. ప్రాణాలకు తప్పిన ముప్పు
Thondapalli: చెలరేగిన మంటలతో కాలిపోయిన కారు ముందు భాగం
Thondapalli: టోల్ ప్లాజా సమీపంలో కారులో మంటలు.. అప్రమత్తమైన డ్రైవర్.. ప్రాణాలకు తప్పిన ముప్పు
Thondapalli: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండపల్లి టోల్ ప్లాజా సమీపంలో కారుకు ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారు ఇంజన్ నుండి పొగ, నిప్పులు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ కారు అపి దిగేశాడు. చెలరేగిన మంటలతో కారు ముందు భాగం కాలిపోయింది. ప్రమాదానికి గురైన కారు మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన సురేందర్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నారు.