తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండెపుడిలో ఘటన

Update: 2023-01-22 08:55 GMT

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

Bhadradri Kothagudem: అనారోగ్యంతో తండ్రి మృతి చెందగా కూతురే అన్ని తానై ముందుకు నడిచింది. తండ్రి చితికి కొరివి పెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడుకు మండలం గుండెపుడికి చెందిన వెంకటేశ్వర్లు అనారోగ్యంతో కన్నుమూశారు. వెంకటేశ్వర్లుకు వారసుడు లేకపోవడంతో పెద్దకూతురు రమాదేవి పుట్టెడు దు:ఖంతో తలకొరివి పెట్టి కన్నతండ్రి రుణం తీర్చుకుంది. కూతురు కన్న తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండటంతో గ్రామ పెద్దలు సైతం ఆమెకు తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చారు.

Tags:    

Similar News