షాకింగ్.. కరోనా బాధితుడి ఇంట్లో 46 మంది నివాసం

తెలంగాణలో కరోనా జోరు పెంచింది. కేసుల సంఖ్య పెరగడంతో ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది.

Update: 2020-04-05 04:08 GMT
Representational Image

తెలంగాణ లో కరోనా జోరు పెంచింది. కేసుల సంఖ్య పెరగడంతో ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 272 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. డీల్లీ మ‌ర్కజ్‌లో త‌బ్లిగి జ‌మాత్ మత ప్రార్థనలకు వెళ్లి వ‌చ్చిన వారి వల్ల క‌రోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

తెలంగాణ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వ యంత్రంగం విస్తృత స్థాయిలో జల్లెడ పడుతుంది. అయితే ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన ఓ వ్యక్తిని గుర్తించి, అతణ్ని గాంధీ ఆస్పత్రికి తరలించి టెస్టులు చేయ‌గా పాజిటివ్ అని తేలింది. కేసు విషయంలో అధికారులకు విస్మయం కలిగించింది.

కోఠి లో ఉంటున్న ఆ వ్యక్తి ఇంట్లో ఏకంగా 46 మంది కుటుంబ‌ స‌భ్యుల‌ు ఉంటారు.వారిదంతా ఉమ్మడి కుటుంబం. అయితే వారిలో వైర‌స్ ఎంత మందికి సోకిందనే అంశం తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

గాంధీ వైద్యురాలు దీప్తి ప్రియాంక ఆధ్వర్యంలో ఈ 46 మంది కుటుంబ సభ్యులకు ఇంట్లోనే వైద్య పరీక్షలు చేస్తున్నారు. వారి శాంపిళ్లు సేక‌రించి గాంధీ ఆస్పత్రిలో టెస్టులకు పంపుతామని వైద్యులు తెలిపారు. 46 మంది చేతిపై క్వారంటైన్ స్టాంప్ వేసి ఇంటిలోనే వుండాలని సూచించారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే ఆస్పత్రికి త‌ర‌లిస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 11మంది మరణించారు. వివిధ ఆసుపత్రుల్లో కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 33కు చేరుకుంది. 

Tags:    

Similar News