Bhatti Vikramarka: అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేస్తాం..
Bhatti Vikramarka: అధికారంలోకి రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం
Bhatti Vikramarka: 46 రోజుకు చేరిన భట్టి విక్రమార్క పాదయాత్ర
Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో కష్టాలు చెప్పుకొనేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరులో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వద్దకు వచ్చి కన్నీళ్లు పెడుతూ కష్టాలు చెప్పుకొన్నారు నాయీ బ్రాహ్మణుడు వెంకటేశ్.
తాను ఎంతో కాయ కష్టం చేస్తానని.. ఎంతో శ్రమించి పిల్లల్ని చదవించానని, వాళ్లకు ఉద్యోగాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న నాటి నుంచి చదువుకోవడానికి వెళ్లడంతో తన కుమారులు కులవృత్తిని కూడా నేర్చుకోలేదన్నారు. ఇటు కులవృత్తి రాక .. అటు ఉద్యోగాలు రాక.. తన పిల్లల భవిష్యత్తు తలుచుంటుంటే.. చాలా భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఉండటానికి ఇల్లు కూడా లేదని, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే సమయంలో తెలంగాణ వచ్చిందని, తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ఆపేసి... డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు ఇవ్వలేదని వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్నది ఇందిరమ్మ రాజ్యమని చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్కమార్క... కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు.