తెలంగాణలో 6 జిల్లాలు రెడ్ జోన్‌లోకి, 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లోకి..

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే.. కానీ నిన్న ఒక్కరోజు మాత్రం 22 కేసులు నమోదు అయ్యాయి.. ముగ్గురు చనిపోయారు.

Update: 2020-05-01 06:26 GMT

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే.. కానీ నిన్న ఒక్కరోజు మాత్రం 22 కేసులు నమోదు అయ్యాయి.. ముగ్గురు చనిపోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి 1038కి చేరుకుంది. ఇందులో 442 మంది కొలుకున్నారు. ప్రస్తుతం 568 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.. 28 మంది మృతి చెందారు. అయితే తెలంగాణలో రెడ్ జోన్‌లో ఉన్న జిల్లాలను కేంద్రం ప్రకటించింది. ఆరు జిల్లాలు రెడ్ జోన్‌లో ఉండగా, 9 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి.

రెడ్ జోన్లు:

హైదరాబాద్‌, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాలను కేంద్రం రెడ్ జోన్లుగా ప్రకటించింది.

ఆరెంజ్ జోన్లు:

నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణ్‌పేట్, మంచిర్యాల జిల్లాలు ఆరెంజ్‌ జోన్లోలలో ఉన్నాయి.

గ్రీన్ జోన్లు:

పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్ధిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలు గ్రీన్ జోన్లలలోనున్నాయి.  

Tags:    

Similar News