పంచాయతీ ఎన్నికల్లో హవా కొనసాగించిన కాంగ్రెస్
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు హవా కొనసాగించారు.
పంచాయతీ ఎన్నికల్లో హవా కొనసాగించిన కాంగ్రెస్
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు హవా కొనసాగించారు. కొన్ని గ్రామాల్లో రీకౌంటింగ్ కారణంగా ఫలితాలు ఆలస్యంగా వెలువడ్డాయి. మొయినాబాద్ మండలం బాకారం జాగీర్ గ్రామంలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ 4 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు.
మొయినాబాద్ మండలంలో 19 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగ్గా.. 9 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ 5, బీఆర్ఎస్ 4, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలుపొందారు. ఇక శంకర్‌పల్లి మండలంలో 24 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలుపొందగా, బీఆర్‌ఎస్ 7, స్వతంత్రులు 5, బీజేపీ ఒక చోట విజయం సాధించాయి.