Hyderabad: హయత్‌నగర్‌లో రోడ్డుప్రమాదం.. ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి.. తండ్రికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ కాలనీ దగ్గర రోడ్డు దాటుతున్న తండ్రీకూతుళ్లను కారు ఢీకొట్టింది.

Update: 2025-12-15 06:29 GMT

Hyderabad: హయత్‌నగర్‌లో రోడ్డుప్రమాదం.. ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి.. తండ్రికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ కాలనీ దగ్గర రోడ్డు దాటుతున్న తండ్రీకూతుళ్లను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కూతురు ఐశ్వర్యతో పాటు తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో.. హుటాహుటిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఐశ్వర్య మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఐశ్వర్య ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ చదువుతోంది. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి ఐశ్వర్య మృతదేహాన్ని తరలించారు. తండ్రికి చికిత్స కొనసాగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News