గురుతేజ్ బహాదూర్ జీ 350వ బలిదాన దినోత్సవం

గురు తేజ్ బహాదూర్ జీ వారి 350వ బలిదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS), సిక్కు పెద్దలు మహానుభావునికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

Update: 2025-12-15 06:25 GMT

హైదరాబాద్: గురు తేజ్ బహాదూర్ జీ వారి 350వ బలిదాన దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (RSS), సిక్కు పెద్దలు మహానుభావునికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వద్ద సభ నిర్వహించారు. ఈ సభలో పలువురు ప్రముఖులు గురు తేజ్ బహాదూర్ జీ జీవితంలోని త్యాగభరితమైన, స్ఫూర్తిదాయకమైన గొప్ప గాధలను విశదీకరించారు.

ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచంద్ర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మత స్వేచ్ఛ, ధర్మరక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన గురు తేజ్ బహాదూర్ జీ చూపిన మార్గం దేశానికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాదులతో పాటు వివిధ న్యాయస్థానాల న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మత స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన తొమ్మిదవ సిక్కు గురువుగా గురు తేజ్ బహాదూర్ జీని గౌరవిస్తారు. ఈ బలిదాన దినోత్సవం సందర్భంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో మూడు రోజులపాటు వేడుకలు, మతపరమైన ఊరేగింపులు, భారీ సభలు నిర్వహిస్తారు. 

Tags:    

Similar News