Raitubandhu: జూన్ 15 నుంచి రైతుబంధు సాయం

Raitubandhu: ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది.

Update: 2021-05-30 01:47 GMT

Raitubandhu:(File Image) 

Raitubandhu: జూన్ 15 నుంచి 25వ తేదీలోపు రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సీఎం తాజా ఆదేశాలతో రాష్ట్రంలోని మొత్తం 59.25 లక్షల మంది రైతులకు సాయం అందనుంది. ఒక్కో రైతు ఖాతాలో రూ. 5 వేల చొప్పున మొత్తం 7,368 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వ్యవసాయ రంగంపై ప్రగతి భవన్‌లో నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు.

మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని గుణాత్మకంగా మార్చివేశామన్నారు. కేసులు వేసి ఆపాలని చూసినా కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయగలిగామని కేసీఆర్ అన్నారు. అలాగే, కల్తీ విత్తనాలు, ఎరువులు, నకిలీ పురుగు మందుల విషయంలో ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. కల్తీ ముఠాలను పట్టుకునే వారికి రివార్డులు, ప్రభుత్వ సేవా పతకాలు అందజేస్తామన్నారు.

కల్తీ విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ అధికారులే అవినీతికి పాల్పడి నకిలీ ముఠాలతో జట్టుకడితే సర్వీసును తొలగిస్తామని, ఐదేళ్లు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీలు విక్రయాలు చేపట్టేలా చూడాలని ఆధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News