తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా కేసులు

Update: 2020-09-14 04:22 GMT

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,417 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్క రోజే 2,479 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కి చేరింది. మృతుల సంఖ్య 974కి పెరిగింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,27,007కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,532 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.1శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. 26,639 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. ఆదివారం 34,427 నమూనాలు పరిశీలించగా, మొత్తం 21,69,339 టెస్టులు చేసినట్లు తెలిపింది. ఇంకా 825 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 264, రంగారెడ్డిలో 133, కరీంనగర్‌లో 108, సంగారెడ్డి 107 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.

Tags:    

Similar News