Xiaomi 15 Ultra: హై కెపాసిటీ బ్యాటరీతో షియోమి కొత్త ఫోన్.. ఫీచర్స్ లీక్

Update: 2024-12-18 15:36 GMT

Xiaomi 15 Ultra: షియోమి తన తదుపరి కొత్త స్మార్ట్‌ఫోన్‌గా Xiaomi 15 Ultra ని పరిచయం చేయాలని భావిస్తోంది. ఈ ఫోన్‌కు ఇటీవలే 3C ధృవీకరణ వచ్చేసింది. ఈ మొబైల్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు 15 అల్ట్రా మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. అంతేకాకుండా టిప్‌స్టర్ DCS కూడా Xiaomi 15 అల్ట్రా బ్యాటరీ గురించి సమాచారాన్ని పంచుకుంది. దీని పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.

షియెమి 15 అల్ట్రా మోడల్ నంబర్ 25019PNF3Cతో MIIT ధృవీకరణ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది. ఈ మోడల్ నంబర్‌లోని 'C' అంటే ఈ మొబైల్ చైనా వేరియంట్ అని అర్థం. సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాల్లో టూ వే SOS మెసేజెస్ పంపడానికి అనుమతించే శాటిలైట్ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌కి ఇది సపోర్ట్ ఇస్తుందని తెలుస్తోంది. ఇదే ఫీచర్ గతంలో షియెమి 14 Ultraలో కూడా ఉంది. ఈ మొబైల్ చైనా మార్కెట్లో మాత్రమే అందబాటులో ఉంటుంది. 

MIIT ధృవీకరణ ప్రకారం.. Xiaomi 15 అల్ట్రా NR SA/NR NSA/TD-LTE/LTE FDD/WCDMA/GSMతో సహా మల్టిపుల్ నెట్‌వర్క్ స్టాండర్డ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. 5G వంటి మెరుగైన మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ (eMBB) టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది.

MIIT ధృవీకరణతో పాటు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weiboలో Xiaomi 15 Ultra  బ్యాటరీ సామర్థ్యం గురించి సమాచారాన్ని కూడా పంచుకున్నాడు. టిప్‌స్టర్ గతంలో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీపై నిరాశను వ్యక్తం చేశాడు. కానీ ఇప్పుడు ఆ సమస్య పరిష్కరించినట్లు కనిపిస్తోంది. Xiaomi 14 అల్ట్రా చైనా, గ్లోబల్ వేరియంట్‌లు వరుసగా 5,300mAh, 5,000mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తున్నాయి.

ఇది Xiaomi 14 Pro కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. Xiaomi 15 Pro 6,100mAh బ్యాటరీతో వస్తుంది. అందుకే Xiaomi 15 Ultra కూడా సిమిలర్ సైజు లేదా పెద్ద బ్యాటరీని కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News