Best Selling Car: గత పదేళ్లలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..!

Best Selling Car: గత పదేళ్లలో ఆటోమోబైల్ రంగంలో మారుతి సుజుకి కంపెనీ ఎనలేని ముద్ర వేసింది.

Update: 2021-11-23 14:46 GMT

Best Selling Car: గత పదేళ్లలో ఆటోమోబైల్ రంగంలో మారుతి సుజుకి కంపెనీ ఎనలేని ముద్ర వేసింది. పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ముఖ్యంగా కార్ల అమ్మకాలలో తిరుగులేకుండా నిలిచింది. గత పదేళ్లలో ఈ కంపెనీకి చెందిన కార్లు ఎక్కువడా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా మారుతి ఆల్టో చాలాకాలం ఆధిపత్యం చెలాయించింది. చిన్న హ్యాచ్బ్యాక్ కార్లలో గత 10 దశాబ్దాలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ వాహనంగా నిలిచింది.

మారుతి సుజుకి డిజైర్ 2011, 2020 మధ్య మొత్తం మార్కెట్ వాటాను 14.93 శాతం నమోదు చేసి దేశంలో అత్యధికంగా అమ్ముడై రెండో స్థానంలో నిలిచింది. అయితే కరోనా వల్ల 2020లో దీని మార్కెట్ వాటా క్షీణించింది. ఆల్టో మార్కెట్ వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉంది. మారుతి స్విఫ్ట్ చాలా కాలంగా ప్రజలకు చురుకైన, సరసమైన హ్యాచ్బ్యాక్గా ఉంది. ఇది 2018 ప్రారంభంలో మూడో తరం అప్డేట్తో పరిచయం అయింది. అసలు డిజైన్, అంతర్గత మార్పులతో ఈ కారు లక్ష బుకింగ్స్తో రికార్డు సృష్టించింది.

స్విఫ్ట్ గత పదేళ్లలో మొత్తం సగటు మార్కెట్ వాటాను 14.31 శాతం నమోదు చేసింది. 2020లో దాని మార్కెట్ వాటాలో స్వల్ప మెరుగుదలను సాధించింది. మారుతి సుజుకి వాగన్ ఆర్ గత దశాబ్దంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన నాలుగో ప్యాసింజర్ వాహనంగా ఉంది. ఎందుకంటే మార్కెట్ వాటా మునుపటి క్యాలెండర్ సంవత్సరంలో 13.99 శాతం నుంచి 12.22 శాతంగా ఉంది. ఐదవ స్థానంలో హ్యుందాయ్ i20 ఉంది. ఇది మునుపటి క్యాలెండర్ సంవత్సరంలో కేవలం 6.93 శాతం నుంచి 8 శాతానికి పైగా మార్కెట్ వాటాను నమోదు చేసింది.

Tags:    

Similar News