Samsung: సామ్‌సంగ్ నుంచి మ‌రో అద్భుతం.. ప్ర‌పంచంలోనే అత్యంత స‌న్న‌ని ఫోల్డ‌బుల్ ఫోన్

Samsung: ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. త‌న త‌దుప‌రి ఫోల్డ‌బుల్ ఫోన్ అయిన గ్యాల‌క్సీ జెడ్ ఫోల్డ్7ను జులై నెల‌లో జెడ్ ఫ్లిప్‌7తో పాటు విడుద‌ల చేయ‌నుంది.

Update: 2025-05-29 14:30 GMT

Samsung: సామ్‌సంగ్ నుంచి మ‌రో అద్భుతం.. ప్ర‌పంచంలోనే అత్యంత స‌న్న‌ని ఫోల్డ‌బుల్ ఫోన్

Samsung: ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ సామ్‌సంగ్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. త‌న త‌దుప‌రి ఫోల్డ‌బుల్ ఫోన్ అయిన గ్యాల‌క్సీ జెడ్ ఫోల్డ్7ను జులై నెల‌లో జెడ్ ఫ్లిప్‌7తో పాటు విడుద‌ల చేయ‌నుంది. తాజాగా ఇది Geekbench అనే బెంచ్‌మార్క్ వెబ్‌సైట్‌లో SM-F966N మోడల్ నంబర్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇది కోరియన్ వేరియంట్ అని తెలుస్తోంది.

గ్యాల‌క్సీ జెడ్ ఫోల్డ్ 7లో Snapdragon 8 Elite ప్రాసెసర్ వాడనున్నట్లు Geekbench వివరాలు సూచిస్తున్నాయి. ఇది గతంలో గెలాక్సీ ఫోన్ల కోసం ప్రత్యేకంగా ఓవర్‌క్లోక్ చేసిన వర్షన్‌లానే ఉండొచ్చని సమాచారం. 8 CPU కోర్లు ఉండగా, అందులో 2 కోర్లు 4.47GHz, మరో 6 కోర్లు 3.53GHz స్పీడ్‌ తో పనిచేస్తాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ప‌నిచేస్తుంది. ఇందులో క‌నీసం 12 జీబీ ర్యామ్ ఉండే అవ‌కాశం ఉంది. కాగా ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత స్లిమ్‌ ఫోల్డబుల్ ఫోన్‌గా మార్కెట్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

ఈ ఫోన్ అన్‌ఫోల్డ్ చేసినప్పుడు మందం 3.9mm, ఫోల్డ్ చేసినప్పుడు మందం 8.9mmగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక బ్యాట‌రీ కెపాసిటీ విష‌యానికొస్తే ఇంఉద‌లో 4,400mAh బ్యాటరీ ఉండబోతుందని సమాచారం.

Tags:    

Similar News