Realme Neo 7x 5G: 6,000mAh బ్యాటరీతో రియల్‌మి కొత్త ఫోన్.. లీకైన ఫీచర్స్..!
Realme Neo 7x 5G: టెక్ మేకర్ రియల్‌మి త్వరలో 'Realme Neo 7x 5G' అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
Realme Neo 7x 5G: 6,000mAh బ్యాటరీతో రియల్‌మి కొత్త ఫోన్.. లీకైన ఫీచర్స్..!
Realme Neo 7x 5G: టెక్ మేకర్ రియల్‌మి త్వరలో 'Realme Neo 7x 5G' అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇటీవల ఈ ఫోన్ JD.comలో ప్రీ-ఆర్డర్ కోసం లిస్ట్ చేశారు. ఈ జాబితా హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ RMX5071గా నిర్ధారిస్తుంది. ఈ రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల TENAA డేటాబేస్‌లో కూడా గుర్తించారు. ఈ నెలాఖరులో చైనాలో ఈ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తుందని భావిస్తున్నారు.
Realme Neo 7x 5G Specifications
TENAA జాబితా ప్రకారం.. రియల్‌మి నియో 7x 5జీ 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుందని చెబుతున్నారు. ఫోన్‌లో 2.3GHz ప్రాసెసర్ ఉండనుంది. అలానే స్నాప్‌డ్రాగన్ 6జెన్ 4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.
ఫోన్‌లో 128 GB, 256 GB, 512 GB, 1 TB వంటి స్టోరేజ్ ఆప్షన్‌లతో పాటు 6 GB, 8 GB, 12 GB, 16 GB వంటి ర్యామ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పవర్ విషయానికొస్తే.. ఫోన్‌లో 6,000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది.
కెమెరా విషయానికి వస్తే.. ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది. అయితే వెనుక సెటప్‌లో 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌తో పాటు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, మైక్రో SD కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత Realme UI 6 ఉన్నాయి. ఫోన్ బరువు 194 గ్రాములు.