Realme 16 Pro First Sale Starts: రియల్‌మీ కొత్త ఫోన్‌పై భారీ ఆఫర్.. ఫస్ట్ సేల్‌లోనే రూ. 8,000 తగ్గింపు! 7000mAh బ్యాటరీతో అదుర్స్..

రియల్‌మీ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలైంది. బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ. 8,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ వంటి ఫీచర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Update: 2026-01-09 08:58 GMT

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు రియల్‌మీ అదిరిపోయే వార్త చెప్పింది. తన పాపులర్ నంబర్ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన Realme 16 Pro సేల్ నేటి నుంచి ప్రారంభమైంది. ప్రీమియం లుక్, అదిరిపోయే కెమెరా, మరియు ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా భారీ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌పై లాంచ్ ఆఫర్ కింద భారీ డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటిచింది.

ధర మరియు అదిరిపోయే ఆఫర్లు:

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరియు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

వేరియంట్లు: 8GB+128GB (రూ. 31,999), 8GB+256GB (రూ. 33,999), 12GB+256GB (రూ. 36,999).

డిస్కౌంట్ వివరాలు: బ్యాంక్ ఆఫర్ కింద నేరుగా రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది. దీనికి అదనంగా పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. అంటే మొత్తంగా రూ. 8,000 వరకు లాభం పొందవచ్చు.

Realme 16 Pro టాప్ ఫీచర్లు:

బ్యాటరీ: ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని 7,000mAh భారీ బ్యాటరీ. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

డిస్‌ప్లే: 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గరిష్టంగా 6,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వెలుగులో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

కెమెరా: ఫోటోగ్రఫీ కోసం 200MP మెయిన్ సెన్సార్‌ను ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఉంది.

ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ 5G చిప్‌సెట్‌తో వేగవంతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

సాఫ్ట్‌వేర్: లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 7.0పై పనిచేస్తుంది.

ప్రత్యేకత ఏంటంటే?

ఈ ఫోన్ కేవలం ఫీచర్ల పరంగానే కాకుండా మన్నికలో కూడా టాప్ అనిపిస్తోంది. దీనికి IP69K రేటింగ్ ఉంది, అంటే నీరు మరియు ధూళి నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. మాస్టర్ గోల్డ్, పెబుల్ గ్రే మరియు ఆర్కిడ్ పర్పుల్ వంటి ప్రీమియం రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

మీరు బడ్జెట్‌లో అదిరిపోయే కెమెరా, బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే, ఈ సేల్ ఆఫర్‌ను వినియోగించుకోవడం మంచి ఛాయిస్.

Tags:    

Similar News