Realme 14 Pro 5G: సోనీ కెమెరాతో వస్తున్న రియల్‌మి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే స్టన్నవుతారు

Update: 2025-01-19 14:00 GMT

Realme 14 Pro 5G: టెక్ దిగ్గజ కంపెనీ రియల్‌మి 14 ప్రో సిరీస్‌లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఇందులో Realme 14 Pro, Realme 14 Pro+,Realme 14 Pro ఫోన్స్ ఉన్నాయి. వీటిలో Realme 14 Pro మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్. దీని మొదటి సేల్ జనవరి 23 నుండి ప్రారంభం కానుంది. మొదటి సేల్ సందర్భంగా కంపెనీ పలు ఆఫర్లను కూడా అందిస్తోంది. 

Realme 14 Pro 5G ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది మెడిటెక్ డైమన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.77 అంగుళాల కర్వ్డ్ ఆమోల్డ్స్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో 8GB RAM + 256GB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.

ఇది 412×1080 పిక్సెల్ రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్,  240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్‌తో లాంచ్ చేశారు. ఇది గ్రాఫిక్స్ కోసం Mali G615 GPU ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మి UI 6.0తో పనిచేస్తుంది.

Realme 14 Pro 5G ఫోన్ OISతో 50-మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇందులో 8MP సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ Realme ఫోన్‌లో 12GB RAM ఉంది. దీనికి 14GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.

Realme 14 Pro 5G మొబైల్ 6000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఈ మొబైల్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. మొబైల్ ప్రొటక్షన్ కోసం IP66+IP68+IP69 రేట్ ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, USB టైప్-C, స్టీరియో స్పీకర్లు మొదలైనవి ఉన్నాయి.

Realme 14 Pro 5G ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో సేల్‌కి రానుంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. 8GB RAM + 25GB స్టోరేజ్ ధర రూ.24,999. ఉంది మొదటి సేల్ కారణంగా కంపెనీ పలు ఆఫర్లను అందిస్తోంది. రూ.2000 బ్యాంక్ ఆఫర్, రూ.1000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, 12 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్‌లు ఉన్నాయి. ఫోన్ పెరల్ వైట్, పింక్, స్వెడ్ గ్రే కలర్స్‌లో ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్ మొదటి సేల్‌ జనవరి 23 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.  కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కూడా కొనవచ్చు. 

Tags:    

Similar News