Lava Shark 5G: రూ. 8 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్లు
Lava Shark 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా మొబైల్స్, దేశీయ మార్కెట్ కోసం తాజాగా ఓ అద్భుతమైన బడ్జెట్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. Lava Shark 5G పేరుతో వచ్చిన ఈ డివైస్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

ఈ ఫోన్ కేవలం రూ. 7,999 ధరకు మాత్రమే లభిస్తుంది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.75 ఇంచెస్‌తో కూడిన IPS LCD డిస్‌ప్లేను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్, 720x1612 పిక్సెల్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం.
ఇందులో IP54 రేటింగ్‌తో కూడిన వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను ఇచ్చారు. Unisoc T765 ప్రాసెసర్‌తో ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ సొంతం.
కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్, 2 ఎంపీతో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు. తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ను అప్డేట్ కావాలనుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.