New Budget Phone Launch: రూ 8వేలకే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ నెక్స్ట్ లెవల్
రూ 8వేలకే కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ నెక్స్ట్ లెవల్
New Budget Phone Launch: ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్‌డీ మొబైల్ త్వరలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించనుంది. కంపెనీ ఈ ఫోన్‌ను తక్కువ ధరకు పరిచయం చేస్తోంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. దీని ద్వారా రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరా, 13MP డ్యూయల్ కెమెరా ఉన్నాయి. ఇది MediaTek Helio G50 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని ర్యామ్‌ను 3GB వరకు పెంచుకోవచ్చు. అలానే 5000mAh బ్యాటరీ కూడా ఉంటుంది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9HD జనవరి 28న భారతదేశంలో లాంచ్ అవుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో వస్తుంది . మీరు ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9HD ఫోన్‌ను కొనవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మింట్ గ్రీన్, కోరల్ గోల్డ్, మెటాలిక్ బ్లాక్ కలర్స్‌లో రానుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9HD అనేది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఈ రాబోయే ఫోన్ ధర సమాచారాన్ని కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ మొబైల్ దాదాపు రూ.8,000 ధరకు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ 3GB RAM వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 3GB వర్చువల్ RAM టెక్నాలజీ కూడా ఉంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9HD టాప్ వేరియంట్ ధర రూ. 10,000 కంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9HD స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. మొబైల్ మీడియాటెక్ హీలియో G50 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రన్ అవుతుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్‌డీ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 13 MP మెయిన్ కెమెరాతో పాటు AI లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్ 5,000mAh కెపాసిటీ ఉండే బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌లో USB టైప్ C పోర్ట్ ఉంది.