ChatGPT Account Delete: మీ పర్సనల్ డేటా సేఫ్ కాదా? చాట్‌జిపిటి అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్ చేయండిలా!

మీ వ్యక్తిగత డేటా భద్రత కోసం చాట్‌జిపిటి అకౌంట్‌ను డిలీట్ చేయాలనుకుంటున్నారా? మొబైల్ మరియు డెస్క్‌టాప్‌లో అకౌంట్‌ను శాశ్వతంగా ఎలా తొలగించాలో ఈ సింపుల్ గైడ్ ద్వారా తెలుసుకోండి.

Update: 2026-01-13 05:49 GMT

అతిగా ఏఐ టూల్స్ మీద ఆధారపడటం వల్ల మనుషుల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకత తగ్గుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు డేటా ప్రైవసీ సమస్యలు కూడా తోడయ్యాయి. అందుకే డిజిటల్ లైఫ్ నుండి కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాలనుకునే వారి కోసం స్టెప్-బై-స్టెప్ గైడ్:

లాప్‌టాప్ లేదా పీసీలో అకౌంట్ డిలీట్ చేయడం ఎలా?

  1. లాగిన్ అవ్వండి: ఏదైనా బ్రౌజర్‌లో చాట్‌జిపిటి ఓపెన్ చేసి మీ ఈమెయిల్‌తో లాగిన్ అవ్వండి.
  2. సెట్టింగ్స్: ఎడమవైపు కింద ఉన్న మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి Settings ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. అకౌంట్ సెక్షన్: సెట్టింగ్స్‌లో Account విభాగంలోకి వెళ్లండి.
  4. డిలీట్: కిందకు స్క్రోల్ చేస్తే Delete Account ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే మీ అభ్యర్థన సబ్మిట్ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్ (Android/iOS) యాప్‌లో డిలీట్ చేసే విధానం:

  1. యాప్ ఓపెన్ చేయండి: మీ ఫోన్‌లోని చాట్‌జిపిటి యాప్‌ను ఓపెన్ చేయండి.
  2. మెనూ: ఎడమవైపు పైన ఉన్న రెండు అడ్డ గీతల (Menu) మీద ట్యాప్ చేయండి.
  3. డేటా కంట్రోల్స్: మీ ప్రొఫైల్ పేరుపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ Data Controls ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. శాశ్వత తొలగింపు: చివరగా Delete OpenAI Account పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి.

అకౌంట్ డిలీట్ చేసే ముందు ఇవి గుర్తుంచుకోండి:

తిరిగి పొందలేరు: ఒకసారి అకౌంట్ డిలీట్ చేస్తే అది శాశ్వతం. మళ్లీ డేటాను రికవర్ చేయడం సాధ్యపడదు.

కొత్త అకౌంట్ కుదరదు: అదే ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్‌తో భవిష్యత్తులో కొత్త అకౌంట్ క్రియేట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు.

సబ్‌స్క్రిప్షన్: మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే, అకౌంట్ డిలీట్ చేసే ముందు అక్కడ క్యాన్సిల్ చేయడం మర్చిపోవద్దు. లేదంటే డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంటుంది.

30 రోజుల సమయం: సర్వర్ల నుండి మీ డేటా పూర్తిగా తొలగించడానికి దాదాపు 30 రోజుల సమయం పడుతుంది.

Tags:    

Similar News