Google AI Mode: త్వరలో తెలుగులోకి రానున్న గూగుల్ ఏఐ మోడ్
Google AI Mode: ఇప్పటివరకు ఆన్ లైన్‌లో ఏ సమాచారం కావాలన్నా గూగుల్ సర్చ్‌నే ఉపయోగించాం. అయితే ఇలా సర్చ్‌ని ఉపయోగించినప్పుడు మనకు కొన్ని లింక్స్ వస్తాయి. దాని ద్వారా మనకు సమాచారం దొరుకుతుంది.
Google AI Mode: త్వరలో తెలుగులోకి రానున్న గూగుల్ ఏఐ మోడ్
Google AI Mode: ఇప్పటివరకు ఆన్ లైన్‌లో ఏ సమాచారం కావాలన్నా గూగుల్ సర్చ్‌నే ఉపయోగించాం. అయితే ఇలా సర్చ్‌ని ఉపయోగించినప్పుడు మనకు కొన్ని లింక్స్ వస్తాయి. దాని ద్వారా మనకు సమాచారం దొరుకుతుంది. కానీ ఇక నుంచి ఏఐ ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటివరకు అమెరికాలో ఉన్న ఈ ఆప్షన్ ఇక నుంచి ఇండియాలో కూడా రాబోతుంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 90 శాతం మంది ఏ సమాచారం కావాలన్నా గూగుల్ సర్చ్‌పైనే ఆధారపడుతున్నారు. ప్రతిరోజు 850 కోట్ల సర్చ్ ల ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు గూగుల్ లో సర్చ్ చేస్తే లింక్స్ మాత్రమే వచ్చేవి. ఇక నుంచి ఏఐ ముందుగా సరైన సమాధానం ఇవ్వనుంది. అదే.. గూగుల్ సర్చ్ ఏఐ మోడ్.
ఇప్పటికే అమెరికా విడుదలై విజయవంతంగా గూగుల్ సర్చ్ ఏఐ మోడ్ సేవలు అందిస్తుంది. ఇక త్వరలో ఇండియాకి కూడా రానుంది. ఏ భాషల్లో సమాచారం కావాలంటే ఆ భాషల్లో ఆ సమాచారాన్ని అందించడానికి సిద్దంగా ఉంది. దీనికోసం ఎలాంటి సైన్ ఆప్స్ అవసరం లేదు. డైరెక్ట్‌గా మొబైల్, వెబ్ వెర్షన్లలో ఏఐ ఆధారిత సర్చ్‌లు చేసుకోవచ్చు. ఇప్పటికి వరకు గూగుల్ వెతికితే దానికి వెబ్ లింక్‌లు మాత్రమే వచ్చేవి. కానీ ఈ సరికొత్త ఏఐమోడ్ టూల్‌తో ఎలాంటి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం దొరుకుతుంది.
ఎటువంటి ప్రశ్న కైనా గూగుల్ సర్చ్ ఏఐ మోడ్ జెమిని సాయంతో సమాధానం ఇస్తుంది. అందుకే ఈ దీన్ని జెమిని 2.5 మోడల్‌గా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇక త్వరలో తెలుగులోకి కూడా రానుంది.