Death Clock: మీరు ఎప్పుడు చనిపోతారో ఈ యాప్‌ చెప్పేస్తుంది.. ఏఐతో సాధ్యమే..!

Death Clock: టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. మారిన కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి.

Update: 2024-12-11 07:18 GMT

Death Clock: మీరు ఎప్పుడు చనిపోతారో ఈ యాప్‌ చెప్పేస్తుంది.. ఏఐతో సాధ్యమే..!

Death Clock: టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. మారిన కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో కూడా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. ఏఐ ఆధారిత యాప్స్‌ చేయలేని పని లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదిలా ఉంటే చివరికి మనిషి ఎప్పుడు చనిపోతాడన్న విషయాన్ని కూడా ఏఐ చెప్పేస్తోంది. డెత్‌ క్లాక్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌ మనుషుల ఆరోగ్యం ఆధారంగా మీ చివరి క్షణాన్ని తెలియజేస్తుంది. ఇదేదో ఉత్తుత్తి యాప్‌ కాబోలు అనుకోకండి. ఎందుకంటే ఈ యాప్‌ డిజైన్‌లో భాగంగా పరిశోధకులు ఎంతో శ్రమించారు. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) అధికారిక డేటాతోపాటు 5.3 కోట్ల మంది భాగస్వాములైన 1200 అంతర్జాతీయ అధ్యయనాలను పరిశీలించి మరీ మరణ తేదీని అంచనా వేస్తుంది.

మనిషి శరీరంలోని కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, రోజువారీ ఆహార అలవాట్లు, వ్యాయామం, సంబంధాలు తదితర విషయాలన్నింటినీ ఈ యాప్‌ పరిగణలోకి తీసుకుంటుంది. అయితే మనిషి కలలో కూడా ఊహించని చావు ఎప్పుడో చెప్పడం అంత మంచిది కాదంటూ కొన్ని వాదనలు వినిస్తున్న నేపథ్యంలో ఈ యాప్‌ డెవలపర్‌ బ్రెంట్ ఫ్రాన్సన్‌ మాట్లాడుతూ.. ప్రజలను భయపెట్టడం మా ఉద్దేశం కాదని, వారి ఆరోగ్య స్థితిగతులపై కచ్చితమైన అవగాహన కల్పించాల నుకున్నామని చెప్పుకొచ్చారు. హెల్త్, ఇన్సూరెన్స్‌ సంస్థల నుంచి సేకరించిన సంప్రదాయ ఆయుఃప్రమాణాలతోపాటు కృత్రిమ మేధ అల్గారిథమ్స్‌ను క్రోడీకరించాకే మరణ తేదీలను లెక్కిస్తుందని తెలిపారు.

ఇక యాప్‌ మనం రోజు తీసుకునే చక్కెర పరిమాణం నుంచి మన పూర్వీకుల అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంది. వీటన్నింటినీ క్రోడీకరించిన తర్వాత మనం మరణానికి ఎంత దూరంలో ఉన్నామన్న విషయాన్ని యాప్‌ ఇట్టే చెప్పేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్‌ భారత్‌లో అందుబాటులోకి రాలేదు. అయితే తొలి మూడు రోజులు ఉచితంగా వాడుకునే యాప్‌కు తర్వాత ఛార్జీలు వసూలు చేస్తారు.

Tags:    

Similar News