Google Chrome: క్రోమ్ వాడుతున్నారా.. షాకింగ్ న్యూస్ చెప్పిన గూగుల్.. వెంటనే అప్‌డేట్ చేయండి.. లేదంటే..

Google Chrome: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌లలో Google Chrome ఒకటి. మీ రోజువారీ పనుల కోసం Chromeని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే, ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..

Update: 2023-04-17 06:30 GMT

Google Chrome: క్రోమ్ వాడుతున్నారా.. షాకింగ్ న్యూస్ చెప్పిన గూగుల్.. వెంటనే అప్‌డేట్ చేయండి.. లేదంటే..

Google Chrome: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్‌లలో Google Chrome ఒకటి. మీ రోజువారీ పనుల కోసం Chromeని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే, ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. లేదంటే భారీ ప్రమాదంలో చిక్కుకుంటారంతే. గూగుల్ బ్రౌజర్‌ని వెంటనే అప్‌డేట్ చేయడం అవసరం. లేదంటే మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్ టాప్ డేంజర్ జోన్‌లోకి వెళ్తుంది. పాత వర్షన్‌ క్రోమ్‌లో ఓ బగ్‌ని Google కనుగొంది. ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పోస్ చేసిన వివరాల మేరకు ఆ బగ్ Windows, Mac, Linuxలో Chromeను ప్రభావితం చేస్తుందని పేర్కొంది.

Google Chrome బ్రౌజర్‌లో రెండు సెక్యూరిటీ బగ్‌లను గుర్తించారు. CVE-2023-2033లో అనే బగ్ డేంజరస్ అని Google గుర్తించింది. Google థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ ఈ బగ్‌ను గుర్తించింది. ఈ భద్రతా లోపాన్ని పరిష్కరించడానికి Google కొత్త Chrome అప‌డేట్‌ని విడుదల చేసింది. వినియోగదారులు వీలైనంత త్వరగా క్రోమ్ బ్రౌజర్‌లను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది.

Google Chromeని ఎలా అప్‌డేట్ చేయాలి?

1. Google Chromeని అప్‌డేట్ చేయడానికి, ముందుగా మీ సిస్టమ్‌లో Chrome బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి.

2. వెబ్ స్క్రీన్ కుడి ఎగువ కార్నర్‌లో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

3. సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.

4. ఆ తర్వాత, 'About Chrome'పై క్లిక్ చేయండి. ఇక్కడ, ఎలాంటి వెర్షన్ ఉపయోగిస్తున్నారో చెక్ చేసుకోవచ్చు.

5. ఇది పాత వెర్షన్‌లో ఉంటే మాత్రం, వెంటనే Google Chromeని తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.

Tags:    

Similar News