Rakul Preet Singh : ఆ నెంబర్‌ను బ్లాక్ చేయండి..రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో వాట్సాప్ స్కామ్
ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ, సైబర్ నేరాల పాత్ర పెరుగుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పేరు చెప్పుకుని అమాయక ప్రజలు, అభిమానులను దుండగులు మోసం చేస్తున్నారు.
Rakul Preet Singh : ఆ నెంబర్‌ను బ్లాక్ చేయండి..రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో వాట్సాప్ స్కామ్
Rakul Preet Singh : ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ, సైబర్ నేరాల పాత్ర పెరుగుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పేరు చెప్పుకుని అమాయక ప్రజలు, అభిమానులను దుండగులు మోసం చేస్తున్నారు. ఈ తరహా మోసాల గురించి ఇప్పటికే పలువురు నటీమణులు ఫిర్యాదు చేశారు. తాజాగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన అభిమానులకు ఇదే విషయంపై గట్టి హెచ్చరిక ఇచ్చారు. రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో కొంతమంది కేటుగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్న విషయం ఆమె దృష్టికి వచ్చింది.
8111067586 అనే మొబైల్ నంబర్ నుంచి కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వాట్సాప్ నంబర్ డిపిలో రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో పెట్టారు. అంతేకాదు బయో వివరాలలో ఆమె సినిమా పేరును కూడా రాశారు. ఆ నంబర్ నుంచి తానే రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పుకుంటూ చాలా మందికి మెసేజ్‌లు పంపించి, వారిని మోసం చేయడానికి ప్రయత్నించారు. ఈ స్కామ్‌ను గుర్తించిన రకుల్, వెంటనే ఆ నంబర్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ మోసం గురించి అభిమానులను అప్రమత్తం చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ఇలా రాశారు... "హాయ్ ఫ్రెండ్స్.. ఎవరో నా పేరు చెప్పుకుని జనాలకు వాట్సాప్ మెసేజులు పంపిస్తున్నారు. దయచేసి గమనించండి, ఇది నా నంబర్ కాదు. ఈ నంబర్ ద్వారా వచ్చే ఎలాంటి మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకండి. వారితో మాట్లాడకండి. దయచేసి వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి." అని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ఆమె ముందుగానే నివారించడానికి ప్రయత్నించారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాత్రమే కాదు, గతంలో మరికొందరు నటీమణులు కూడా ఇదే విధమైన సైబర్ మోసాలను ఎదుర్కొన్నారు. నటి అదితి రావు హైదరి కూడా తన పేరుతో ఎవరో వాట్సాప్ చేస్తూ, ఫొటోగ్రాఫర్‌లకు మెసేజ్‌లు పంపి, ఫోటోషూట్‌ల గురించి అడుగుతున్నారని హెచ్చరించారు. అలాగే, కాంతార: చాప్టర్ 1 నటి రుక్మిణి వసంత కూడా ఇదే తరహాలో 9445893273 నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని ఆమె కూడా స్పష్టం చేశారు.