Apple Event 2021: నేడే యాపిల్ ఈవెంట్.. లాంచ్ కానున్నవి ఇవేనా..?

Apple Event 2021: ఈరోజు యాపిల్ కొత్త ఈవెంట్ అమెరికాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో జరగనుంది.

Update: 2021-04-20 11:14 GMT

యాపిల్ న్యూ ఈవెంట్ 2021 (ఫొటో ట్విట్టర్)

Apple WWDC Event 2021: ఈరోజు (ఏప్రిల్ 20) యాపిల్ కొత్త ఈవెంట్ (Apple WWDC)  అమెరికాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో రాత్రి 10:30 గంటలకు(మనదేశ కాలమానం ప్రకారం) జరగనుంది. ఈ ఈవెంట్ లో కొత్త ఐప్యాడ్, ఐమ్యాక్, యాపిల్ టీవీ, ఎయిర్ ట్యాగ్స్ లాంచ్ కానున్నాయని టాక్ వినిపిస్తోంది. ఐవోఎస్ 14.5 ను కూడా విడుదల చేయవచ్చని సమాచారం. దీంతోపాటు ఎయిర్ పోడ్స్ 3 పై కూడా ప్రకటన చేయవచ్చు.

యాపిల్ యూట్యూబ్ చానెల్లో ఈ ఈవెంట్ ను చూడొచ్చు. ఈ కార్యక్రమంలో కొత్త ఐప్యాడ్ మోడళ్లు.. కొత్త ఐప్యాడ్ మినీ, ప్రారంభ స్థాయి ఐప్యాడ్, కొత్త ఐప్యాడ్ ప్రో మోడళ్లు ప్రదర్శించే అవకాశం ఉంది. కొత్త ఐప్యాడ్ ప్రో లైనప్‌లో మినీ ఎల్ఈడీ డిస్ ప్లేలు, 5జీ ఎంఎంవేవ్ సపోర్ట్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇందులో కొత్త యాపిల్ చిప్ వాడనున్నారని తెలుస్తోంది. దీంతోపాటు యాపిల్ పెన్సిల్ 3 కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

వీటితో పాటు ఐమ్యాక్ మోడళ్లు కూడా ఈ ఈవెంట్లో రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. ఈ ఐమ్యాక్‌ల్లో యాపిల్ ఎం1 చిప్‌ను అందించనున్నారు. కొత్త ఐమ్యాక్ మోడళ్లు, మరిన్ని రంగుల్లో అందిస్తారని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 24 అంగుళాల కొత్త ఐమ్యాక్ ను ప్రవేశపట్టనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ లో కొత్త ఐiMacఫోన్‌లను ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది.

కొత్త ఎయిర్ పోడ్స్.. ఎయిర్ పోడ్స్ 3 అనే పేరుతో లాంచ్ అవనున్నాయని టాక్. ఎయిర్ పోడ్స్ ప్రో తరహా డిజైన్‌నే యాపిల్ కంపెనీ వాడినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ట్రూ వైర్ లెస్ ఆడియోను ఎంజాయ్ చేయవచ్చు. అలాగే కొత్త యాపిల్ టీవీ కూడా మార్కెట్లోకి విడుదల కానుందని టాక్.


Tags:    

Similar News