iPhone 17 సిరీస్ రాబోతుంది: ధరలు పెరగనున్నాయా? ఇండియా, అమెరికా, యూకేలో ఎంతంటే?

ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ 2025లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి నాలుగు మోడల్స్ రాబోతున్నాయి – iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max మరియు కొత్తగా iPhone 17 Air. ప్రో మోడల్స్‌లో కొత్త డిజైన్, వేగవంతమైన చిప్, మెరుగైన కెమెరాలు ఉంటాయి. ఇక iPhone 17 Air ఆపిల్ ఇప్పటివరకు విడుదల చేసిన ఫోన్లలోనే అతి సన్నని ఫోన్‌గా ఉండబోతోంది.

Update: 2025-07-20 09:20 GMT

iPhone 17 సిరీస్ రాబోతుంది: ధరలు పెరగనున్నాయా? ఇండియా, అమెరికా, యూకేలో ఎంతంటే?

ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ 2025లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈసారి నాలుగు మోడల్స్ రాబోతున్నాయి – iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max మరియు కొత్తగా iPhone 17 Air. ప్రో మోడల్స్‌లో కొత్త డిజైన్, వేగవంతమైన చిప్, మెరుగైన కెమెరాలు ఉంటాయి. ఇక iPhone 17 Air ఆపిల్ ఇప్పటివరకు విడుదల చేసిన ఫోన్లలోనే అతి సన్నని ఫోన్‌గా ఉండబోతోంది. అయితే, తయారీ ఖర్చులు, గ్లోబల్ ట్రేడ్ సమస్యల కారణంగా ఈసారి ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఎప్పుడు విడుదల?

ఆపిల్ సెప్టెంబర్ 8 నుండి 11 మధ్య ఐఫోన్ 17 సిరీస్‌ను ఆవిష్కరించనుంది. అదే వారంలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి.

మోడల్‌వారీ ధరలు (అంచనా)

iPhone 17 Pro Max – ఇండియాలో ₹1,64,900, అమెరికాలో $2,300

iPhone 17 Pro – ఇండియాలో ₹1,45,000

iPhone 17 Air – ఇండియాలో ₹90,000, అమెరికాలో $899

దేశాలవారీ ధరలు

భారతదేశం: ₹79,900

అమెరికా: $899

యూఏఈ: AED 3,799

యూకే: ~£849

యూరప్ (జర్మనీ, ఫ్రాన్స్): ~€1,019

ఆస్ట్రేలియా: ~AUD 1,599

కెనడా: ~CAD 1,199

చైనా: ~CNY 6,499

జపాన్: ~JPY 129,800

సింగపూర్: ~SGD 1,429

iPhone 17 Pro ఫీచర్లు

కొత్త హారిజాంటల్ కెమెరా డిజైన్

A19 బయోనిక్ చిప్ (2nm), 12GB RAM, iOS 26

48MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8K వీడియో రికార్డింగ్

ముందు కెమెరా 24MPకి అప్‌గ్రేడ్

కొత్త కలర్స్: బ్లాక్, సిల్వర్, గ్రే, డార్క్ బ్లూ, ఆరెంజ్-కాపర్

iPhone 17 Air ఫీచర్లు

కేవలం 5.5mm మందం, బరువు 145 గ్రాములు

6.6-అంగుళాల OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

వెనుక ఒకే 48MP కెమెరా, ముందు 24MP కెమెరా

2,800mAh బ్యాటరీ, కొత్త Adaptive Power Mode

సెప్టెంబర్ ఈవెంట్ దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం – ఈసారి ధరలు పెరిగినా, ప్రో మోడల్స్‌లో పెద్ద మార్పులు, అప్‌గ్రేడ్స్ రాబోతున్నాయి.

Tags:    

Similar News