Google Pixel 10: పిచ్చెక్కించే డీల్.. పిక్సెల్ 10పై ఊహించని డిస్కౌంట్..!
గూగుల్ అత్యంత ప్రసిద్ధ ఫోన్‌లలో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్, శక్తివంతమైన గూగుల్ టెన్సర్ G5 చిప్‌సెట్‌తో వస్తోంది. ఇది చాలా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.
Google Pixel 10: పిచ్చెక్కించే డీల్.. పిక్సెల్ 10పై ఊహించని డిస్కౌంట్..!
Google Pixel 10: గూగుల్ అత్యంత ప్రసిద్ధ ఫోన్‌లలో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్, శక్తివంతమైన గూగుల్ టెన్సర్ G5 చిప్‌సెట్‌తో వస్తోంది. ఇది చాలా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.4K రిజల్యూషన్ వరకు రికార్డ్ చేయగల 48మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో చాలా చక్కని ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,970mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అంతేకాకుండా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి సేల్‌లో గూగుల్ పిక్సెల్ 10 ఫోన్‌ను రూ.11,000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ భారతదేశంలో రూ.79,999కి లాంచ్ అయింది, కానీ 14శాతం డిస్కౌంట్ తర్వాత రూ. 68,890కి కొనుగోలు చేయచ్చు. అంటే మొత్తంమీద రూ.11,110 వరకు ఆదా చేస్తారు. అంతేకాకుండా అమెజాన్ పే బ్యాలెన్స్ నుంచి పేమెంట్ చేస్తే రూ.2,066 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దానితో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి గూగుల్ పిక్సెల్ 10 ఫోన్‌పై రూ.1,000 వరకు తగ్గింపు పొందచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్‌లో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1080 x 2424 రిజల్యూషన్, స్మూత్ స్క్రోలింగ్ కోసం 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ కూడా అందించారు. ఇది వాటర్, డస్ట్ రెసిస్టెనక్స్ కోసం IP68 రేటింగ్‌ను కూడా పొందుతుంది. ఈ ఫోన్ అబ్సిడియన్, ఇండిగో ఫ్రాస్ట్, లెమన్‌గ్రాస్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్‌లో టెన్సార్ G5 చిప్‌సెట్ ఉంటుంది. దీనిని TSMC 3ఎన్ఎమ్ ప్రాసెస్‌లో తయారీ చేశారు. ఫోన్‌లో గేమింగ్, మల్టీ టాస్కింగ్ వంటి హై-ఎండ్ పనులను ఎటువంటి సమస్య లేకుండా సులభంగా మెనేజ్ చేయచ్చు. ఈ ఫోన్ 7 సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్,సేఫ్టీ అప్‌డేట్లను పొందుతుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 16లో రన్ అవుతుంది. అలానే దీనికి పిక్సెల్ డ్రాప్స్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 12జీబీ ర్యామ్, 128జీబీ లేదా 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
ఫోన్‌లో బ్యాక్ ట్రిపుల్ కెమెరా చూస్తారు. ఇందులో 48మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 13మెగాపిక్సుల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 10.8మెగాపిక్సుల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది కెమెరా కోచ్, నైట్ సైట్, మైక్రో ఫోకస్ , బెస్ట్ టేక్ వంటి AI-ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ ఆటో-ఫోకస్ ఫీచర్‌తో 10.5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది వెనుక, ముందు కెమెరాలలో 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.
గూగుల్ పిక్సెల్ 10 5జీ ఫోన్ 4,970mAh బ్యాటరీని ప్యాక్‌తో వస్తుంది, ఇది 24 గంటలకు పైగా బ్యాకప్ అందిస్తుంది. 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయచ్చు. ఇది గూగుల్ పిక్సెల్ స్నాప్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న Qi2 సర్టిఫైడ్ టూల్స్ ద్వారా 15W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి.