Yashasvi Jaiswal: సెంచరీ మిస్ అయినా రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal: ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున, భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు.
Yashasvi Jaiswal: సెంచరీ మిస్ అయినా రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal: ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున, భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా రెండో మ్యాచ్‌లో సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. మ్యాచ్ ప్రారంభం నుంచీ స్థిరంగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్, ఇంగ్లాండ్ బౌలర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ సెంచరీ అంచుల వద్ద తడబడి, 87 పరుగుల వద్ద కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయినప్పటికీ, జైస్వాల్ తన ఈ ఇన్నింగ్స్‌తో టీమ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడంలో విజయం సాధించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్, జట్టుకు మంచి ఆరంభాన్ని అందించడంలో సక్సెస్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ త్వరగా ఔటైనప్పటికీ, జైస్వాల్ బెదరకుండా తన నేచురల్ ఆటనే కొనసాగించాడు. కేవలం 59 బంతుల్లోనే తన టెస్ట్ కెరీర్‌లో 11వ హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేశాడు. అయితే, జైస్వాల్ సెంచరీకి చేరువలో ఉండగా, ఇంగ్లాష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన 46వ ఓవర్ మొదటి బంతికి వికెట్ సమర్పించుకున్నాడు.
ఈ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌తో జైస్వాల్, SENA (సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన భారత ఓపెనర్‌ల జాబితాలో రోహిత్ శర్మను అధిగమించాడు. SENA దేశాలలో జైస్వాల్ భారత ఓపెనర్‌గా ఐదు సార్లు 50+ స్కోర్లు సాధించాడు. దీని ద్వారా SENA దేశాలలో ఓపెనర్‌గా నాలుగు సార్లు 50+ స్కోర్లు సాధించిన రోహిత్ శర్మను అధిగమించాడు. విశేషం ఏంటంటే, రోహిత్ శర్మ ఈ ఘనతను 18 ఇన్నింగ్స్‌లలో సాధిస్తే, యశస్వి జైస్వాల్ మాత్రం కేవలం 17 ఇన్నింగ్స్‌లలోనే రోహిత్ శర్మను అధిగమించాడు.
ఇంగ్లాండ్‌పై టెస్ట్ క్రికెట్‌లో భారత ఓపెనర్‌గా అత్యధిక 50+ స్కోర్లు సాధించిన వారి జాబితాలో యశస్వి జైస్వాల్ మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. 12 ఇన్నింగ్స్‌లలో 7 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించి, అతను లెజెండరీ బ్యాట్స్‌మెన్‌లను అధిగమించడంలో విజయం సాధించాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో సునీల్ గవాస్కర్ 20 సార్లు ఈ ఘనత సాధించగా, రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 8 సార్లు ఈ ఘనత సాధించాడు.