WPL 2026: ఆర్సీబీ అదరగొట్టింది.. వరుసగా రెండోసారి కప్పు మనదే! స్మృతి మంధాన టీమ్‌కు విరాట్ కోహ్లీ స్పెషల్ విష్
Virat Kohli Congratulates RCB : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది.
Virat Kohli Congratulates RCB : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి కప్పును కైవసం చేసుకున్న ఆర్సీబీ (RCB) జట్టుపై స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. కెప్టెన్ స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు ప్రదర్శన చూసి గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు.
ఆర్సీబీ జెండా ఎగురవేశారు: కోహ్లీ
విజయానంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన విరాట్ కోహ్లీ, ఆర్సీబీ ట్రోఫీ అందుకుంటున్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. "రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి ఆర్సీబీ పతాకాన్ని అత్యున్నత స్థానంలో ఎగురవేశారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. స్మృతి మంధాన, మొత్తం జట్టు మరియు మేనేజ్‌మెంట్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విజయానికి మీరు నిజంగా అర్హులు. ఈ అద్భుతమైన క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించండి" అని కోహ్లీ రాసుకొచ్చారు.
ఖుషీలో ఫ్యాన్స్.. ఐపీఎల్‌లోనూ ఇదే రిపీట్ కావాలి!
మహిళల జట్టు వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలవడంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. విరాట్ కోహ్లీ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. "అక్కలు కొట్టారు.. ఇక తమ్ముళ్ల వంతు" అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ (IPL)లో పురుషుల జట్టు కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ చేసి, 'ఈ సాలా కప్ నమ్దే' కలని నిజం చేయాలని కోరుకుంటున్నారు.