Asia Cup 2025: ఆసియాకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా
Asia Cup 2025: టీమ్ ఇండియా ఆసియాకప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సూపర్ -4 భారత్ రెండో మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది.
Asia Cup 2025: టీమ్ ఇండియా ఆసియాకప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సూపర్ -4 భారత్ రెండో మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. అభిషేక్ శర్మ 75 పరుగులు, కుల్ దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అభిషేక్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినా.. భారీ స్కోరు చేసేలా కనిపించిన జట్టు 168 పరుగులతో సరిపెట్టుకుంది. హార్దిక్ 38, గిల్ 29 పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ 2, తంజిమ్, ముస్తాఫిజుర్ ఓ వికెట్ తీసి భారత్ ను కట్టడి చేశారు. చేధనలో బంగ్లాదేశ్ 127 పరుగులకే కుప్పకూలింది.