Shreyas Iyer: ఐసీయూలో చేరిన భారత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన వన్డే మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.
Shreyas Iyer: ఐసీయూలో చేరిన భారత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన వన్డే మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. రిబ్ కేజ్‌పై దెబ్బ తగలడంతో అంతర్గత రక్తస్రావం కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నా, కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అయ్యర్ వారం రోజుల తర్వాత స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్, రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
శనివారం జరిగిన మ్యాచ్‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో కిందపడిపోయాడు. ఆ సమయంలో రిబ్ కేజ్‌పై బలమైన దెబ్బ తగిలింది. కష్టమైన క్యాచ్‌ను అందుకున్నప్పటికీ వెంటనే నొప్పితో నేలపైనే పడిపోయాడు. జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి తొలుత ప్రాథమిక చికిత్స అందించగా, తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి తీసుకెళ్లారు. కొద్ది సేపట్లోనే బీపీ తీవ్రస్థాయిలో పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం హాస్పిటల్‌లో చేసిన స్కానింగ్‌లో శ్రేయస్ రిబ్ కేజ్ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు పరిస్థితి విషమించకముందే ఐసీయూలో చేర్చారు. గత 2 రోజులుగా అయ్యర్ ఐసీయూలోనే ఉన్నాడు. రక్తస్రావం ఆగకపోతే ఇన్‌ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది కాబట్టి వైద్యులు కనీసం రెండు రోజుల నుంచి వారం రోజుల వరకూ అబ్జర్వేషన్‌లో ఉంచుతారు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.