IND vs ENG: ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ఇషాన్ ఔట్.. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు లక్కీ ఛాన్స్..!

IND vs ENG Test Series: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది.

Update: 2024-01-13 08:16 GMT

IND vs ENG: ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ఇషాన్ ఔట్.. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు లక్కీ ఛాన్స్..!

IND vs ENG Test Series: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. భారత సెలెక్టర్లు జట్టులో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయగా, ఒక అన్ క్యాప్డ్ వికెట్ కీపర్‌కు అవకాశం లభించింది. జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

భారత జట్టులో నలుగురు స్పిన్నర్లు చోటు దక్కించుకున్నారు. అనుభవజ్ఞులైన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం దక్కింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కింద భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ టెస్టు సిరీస్ జరగనుంది. భారత పేస్ అటాక్‌లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, అవేశ్ ఖాన్‌లకు చోటు దక్కింది. ఈ బౌలర్లందరూ దక్షిణాఫ్రికా పర్యటనలో జట్టులో ఉన్నారు.

ఇషాన్ స్థానంలో జురెల్‌కు అవకాశం లభించగా..

ఇషాన్ కిషన్ గైర్హాజరీతో అన్‌క్యాప్డ్ ధృవ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. 16 మంది సభ్యుల జట్టులో కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ మరో ఇద్దరు వికెట్ కీపర్లు. నాలుగేళ్ల క్రితం ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన అండర్-19 జట్టుకు జురెల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, ఎస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), కెఎస్ భరత్ (వికెట్), ధ్రువ్ జురెల్ (వికెట్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), అవేష్ ఖాన్.

Tags:    

Similar News