ఘోరంగా విఫలమైన టాప్‌ ఆర్డర్‌.. పాకిస్తాన్ విజయలక్ష్యం 152

T20 WC 2021 IND Vs PAK: ఊహించనిది జరిగింది.

Update: 2021-10-24 15:57 GMT
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (ఫైల్ ఇమేజ్)

T20 WC 2021 IND Vs PAK: టీ 20 వరల్డ్‌కప్‌లో 20 ఓవర్లకు భారత్‌ 7వికెట్ల నష్టానికి నూట యాభై ఒక్క పరుగులు చేసింది. దీంతో 152 పరుగుల విజయలక్ష్యంతో పాక్‌ బరిలోకి దిగనుంది. హాఫ్‌ సెంచరీతో విరాట్‌ కో‌హ్లీ టీమ్‌ను ఆదుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ (57), రిషభ్‌ పంత్‌ (39) రాణించగా మిగతా ఆటగాళ్లెవరూ ఆకట్టుకోలేదు. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిది 3, హసన్‌ అలీ 2, షాబాద్‌ ఖాన్‌, హరిస్‌ రౌత్‌ 1 చెరో వికెట్‌ తీశారు.

Tags:    

Similar News