T20 World Cup 2026 Final: అహ్మదాబాద్ లో భారీగా పెరిగిన హోటల్ గదుల అద్దెలు.. ఒక్కరోజుకు ఎంతంటే..
T20 World Cup 2026 Final: భారత్ ఫైనల్స్ కు చేరిన వెంటనే అహ్మదాబాద్ హోటల్స్ రూమ్ అద్దెలు విపరీతంగా పెంచేశారు. మరోవైపు విమాన టికెట్ల ధరలు కూడా పెరిగిపోయాయి
T20 World Cup 2026 Final
T20 World Cup 2026 Final: టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కి దూసుకెళ్ళిపోయింది. ఈ ఆదివారం అంటే మార్చి 8న న్యూజిలాండ్ తో కప్ కోసం పోటీ పడుతుంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత, టీం ఇండియా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరో ఐసిసి ఈవెంట్‌లో ఫైనల్ ఆడటానికి రెడీ అయిపోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఈ తుది పోరుకు సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఆతిథ్య దేశం భారతదేశం ఫైనల్‌లోకి ప్రవేశించడం భారత క్రికెట్ అభిమానులకు ఒక వేడుక. అందుకే, క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్ కు దారి ట్టీస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అహ్మదాబాద్‌లోని హోటళ్లు గది అద్దెను ఐదు రెట్లు పెంచేశాయి.
10 వేల నుంచి 75 వేలకు..
T20 World Cup 2026 Final: మార్చి 8న నరేంద్ర మోడీ స్టేడియంలో టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ కు మరింత మంది అభిమానులు తరలి రావడం ఖాయం కావడంతో, అహ్మదాబాద్ లో హోటల్ ధరలు పెరిగాయి. మార్చి 7, 8 తేదీల్లో హోటల్ గదుల అద్దెలు రూ.75 వేలకు చేరుకున్నాయి. గతంలో 10 వేలకు లభించే గది అద్దె 40 వేల నుంచి 75 వేలకు పెరిగింది. హయత్ రీజెన్సీ, హోటల్ సహా అనేక హోటళ్ల అద్దె పెరిగింది. మారియట్, ఐటీసీ, ఫార్చ్యూన్ హోటళ్ల అద్దె కూడా పెరిగింది. అంతేకాకుండా చాలా హోటళ్లు తమ గదులలో కొన్నిటిని బ్లాక్ చేసి పెట్టినట్టు తెలుస్తోంది. మ్యాచ్ రోజు వాటిని మరింత ఎక్కువ ధరకు ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నట్టు చెబుతున్నారు.
ఐదు రెట్లు..
T20 World Cup 2026 Final: T20 ప్రపంచ కప్ ఫైనల్ అహ్మదాబాద్‌లో జరుగుతుండడంతో హోటల్ గదుల ధరలు పెరిగే ఛాన్స్ ఉందని ముందునుంచి అంచనా వేస్తున్నారు. కానీ, ఈ స్థాయిలో పెరుగుతాయని ఊహించలేదు. ముఖ్యంగా టీమ్ ఇండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకున్న తర్వాత, అహ్మదాబాద్‌కు వచ్చే అభిమానుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నారు. అందువల్ల, గదుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో, 2023 ODI ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హోటల్ ధరలు విపరీతంగా పెరిగాయి. హోటల్ గదుల ధరల పెరుగుదలతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అహ్మదాబాద్‌కు విమానాల ధరలు కూడా పెరిగాయి.