T20 World Cup 2nd Semi Final: భారత్-ఇంగ్లాండ్ ల మధ్య సెమీస్ పోరు.. పిచ్.. వాతావరణం ఇలా..
T20 World Cup 2nd Semi Final: టీ20 ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్స్ లో టీమిండియా ఇంగ్లాండ్ తో ఈరోజు వాంఖడే స్టేడియంలో తలపడుతుంది.
T20 World Cup 2nd Semi Final
T20 World Cup 2026 2nd Semi Final: టీ20 ప్రపంచ కప్ 2026 చివరి దశకు చేరుకుంది. వెస్టిండీస్‌పై విజయంతో టీం ఇండియా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈరోజు అంటే మార్చి 5న ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ రెండు జట్లు సెమీఫైనల్స్‌లో వరుసగా మూడోసారి తలపడుతున్నాయి. 2022లో ఇంగ్లాండ్ భారత్‌ను ఓడించి కప్ గెలుచుకోగా, 2024లో భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించి కప్ గెలుచుకుంది. ఇప్పుడు 2026లో ఈ రెండు జట్లు ఒకదానికొకటి తలపడుతున్నాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒకే ప్రత్యర్ధులు వరుసగా మూడు సెమీఫైనల్స్ లో తలపడుతుండడం ఒక విశేషంగా చెప్పవచ్చు. ఈ టోర్నీ నాకౌట్ పోటీల్లో సమ ఉజ్జీలుగా ఉన్న భారత్-ఇంగ్లాండ్ లలో ఎవరిది పై చేయి కాబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. మామూలుగా నాకౌట్ పోటీలకు ఉండే హై కంటే.. ఇంగ్లాండ్ - భారత్ మధ్య జరగబోయే ఈ పోరుపై మరింతగా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ముంబైలో వాతావరణం ఎలా ఉంటుంది?
T20 World Cup 2026 2nd Semi Final: వాతావరణ శాఖ అంచనా ప్రకారం, మార్చి 5న ముంబైలో వర్షం పడే అవకాశం లేదు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని, రాత్రిపూట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా. తేమ స్థాయి 35 నుండి 51 శాతం వరకు ఉంటుంది, అంటే మ్యాచ్ కు వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది.
పిచ్ ఎలా ఉండొచ్చు..
వాంఖడే స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రెండు వైపుల నుండి పరుగులు ఆశించవచ్చు. అలాగే, రెండవ ఇన్ని..గ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు సహాయపడుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
రిజర్వ్ డే..
T20 World Cup 2026 2nd Semi Final: మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశం లేకపోయినప్పటికీ, ముందుజాగ్రత్తగా ఐసిసి రిజర్వ్ డేను షెడ్యూల్ చేసింది. మార్చి 5న మ్యాచ్ ఏ కారణం చేతనైనా పూర్తి చేయలేకపోతే, మార్చి 6న శుక్రవారం రిజర్వ్ డేన మ్యాచ్ జరుగుతుంది. అయితే, వర్షం కారణంగా సెమీ-ఫైనల్ - రిజర్వ్ డే రెండూ రద్దు అయితే కనుక నిబంధనల ప్రకారం ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ తమ గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచింది, భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది. అయితే, ఆ ఛాన్స్ లేదు. వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
ఫైనల్స్ న్యూజిలాండ్ తో..
ఈ సెమీస్ విజేత ఫైనల్స్ లో మార్చి 8న న్యూజిలాండ్ తో తలపడవలసి వస్తుంది. న్యూజిలాండ్ మొదటి సెమీఫైనల్స్ లో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఇప్పటికే ఫైనల్స్ చేరింది.