IND vs ENG Semi Final: అక్కడ ముంబై పిచ్, సెమీఫైనల్లో కుల్దీప్ ఆడాల్సిందే.. భారత్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

IND vs ENG Semi Final: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగే కీలక సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియా కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చ మొదలైంది. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ప్లేయింగ్ 11పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పకుండా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని సూచించాడు.

Update: 2026-03-04 18:13 GMT

IND vs ENG Semi Final: అక్కడ ముంబై పిచ్, సెమీఫైనల్లో కుల్దీప్ ఆడాల్సిందే.. భారత్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

IND vs ENG Semi Final: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగే కీలక సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమిండియా కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చ మొదలైంది. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ప్లేయింగ్ 11పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పకుండా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని సూచించాడు. ముంబై పిచ్ స్వభావం, ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూర్పు దృష్ట్యా ఈ నిర్ణయం కీలకమని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా గురువారం ఇంగ్లాండ్‌తో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.

భారత్, ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'ఇంగ్లాండ్ టాప్-9లో ఎనిమిది మంది కుడిచేతి బ్యాటర్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల స్పిన్నర్ చాలా అవసరం. వరుణ్‌ చక్రవర్తికి బాగా బౌలింగ్ చేస్తున్నా.. ఈ టోర్నీలో పెద్దగా ప్రభావం చూపడం లేదు. అతడి స్థానంలో మరో వికెట్ తీసే ఆప్షన్ ఉండాలి. మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలను విడ్డగొట్టే బౌలర్ జట్టుకు అవసరం' అని అభిప్రాయపడ్డాడు.

'ముంబై పిచ్ సాధారణంగా ఫ్లాట్‌గా ఉంటుంది. పేసర్లకు వికెట్లు తీయడం ఇక్కడ కష్టమవుతుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు పేసర్ల బౌలింగ్లో సులభంగా పరుగులు సాధించే అవకాశం ఉంది. అందుకే ముంబైలో స్పిన్ కీలక పాత్ర పోషిస్తుంది. కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ మిడిల్ ఓవర్లలో గేమ్‌ను మార్చగలడు. పరుగులు కట్టడి చేయడమే కాకుండా వికెట్స్ కూడా తీస్తాడు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. అవసరమైతే ఒక బ్యాటర్‌ను త్యాగం చేయాల్సి వచ్చినా సరే.. కుల్దీప్‌ను జట్టులోకి తీసుకోవాలని శాస్త్రి సూచించాడు. మ్యాచ్ మలుపుతిప్పే సామర్థ్యం ఉన్న బౌలర్‌గా కుల్దీప్‌ను అభివర్ణించాడు.

ఇప్పటికే వరుణ్ చక్రవర్తి జట్టులో కీలక స్పిన్నర్‌గా ఉన్నా.. ఒక్కరిపై మాత్రమే ఆధారపడడం ప్రమాదకరమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వరుణ్‌ బాగా బౌలింగ్ చేస్తాడో లేదో చెప్పలేం. కాబట్టి రెండో వికెట్ టేకింగ్ ఆప్షన్ అవసరం' అని చెప్పాడు. మొత్తానికి రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలు జట్టు కాంబినేషన్‌పై చర్చను మరింత వేడెక్కించాయి. ముంబై పిచ్‌పై స్పిన్ బౌలింగ్ ప్రభావం చూపుతుందా?, కుల్దీప్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News