Finn Allen Century: టీ20 వరల్డ్ కప్‌లో ఫిన్‌ అలెన్ చరిత్ర.. యూనివర్సల్ బాస్ రికార్డు బ్రేక్!

Finn Allen Century: న్యూజిలాండ్‌ ఓపెనర్ ఫిన్‌ అలెన్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు.

Update: 2026-03-04 18:24 GMT

Finn Allen Century: టీ20 వరల్డ్ కప్‌లో ఫిన్‌ అలెన్ చరిత్ర.. యూనివర్సల్ బాస్ రికార్డు బ్రేక్!

Finn Allen Century: న్యూజిలాండ్‌ ఓపెనర్ ఫిన్‌ అలెన్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం కోల్‌కతాలో ఇంగ్లాండ్‌తో జరిగే సెమీస్ మ్యాచ్‌లో 33 బంతుల్లో శతకం బాదడంతో అలెన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. అలెన్ తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సులతో 100 రన్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్, విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరుపై ఉంది. 2016లో ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌పై 47 బంతుల్లో గేల్ సెంచరీ బాదాడు.

అలాగే పూర్తి సభ్య దేశంపై టీ20ల్లో నమోదైన వేగవంతమైన సెంచరీ కూడా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా మొత్తం టీ20ఐల్లో ఇది సంయుక్తంగా మూడో వేగవంతమైన శతకంగా నిలిచింది. ఫుల్ మెంబర్ జట్టుకు చెందిన బ్యాటర్‌గా వేగవంతమైన సెంచరీ రికార్డును సికందర్ రాజాతో కలిసి అలెన్ పంచుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ఐల్లో గతంలో అత్యంత వేగవంతమైన సెంచరీ గ్లెన్ ఫిలిప్స్ పేరుపై ఉంది. అతడు 46 బంతుల్లో వెస్టిండీస్‌పై (మౌంట్ మౌంగనుయి, 2020) శతకం సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును అలెన్ అధిగమించి కివీస్ క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు.

మొత్తానికి ఫిన్ అలెన్ 33 బంతుల సెంచరీ టీ20 క్రికెట్‌లో ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ జట్టుకు అతడు బలమైన పునాది వేసి మ్యాచ్ దిశను పూర్తిగా మార్చేశాడు. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహన్ పేరుపై ఉంది. అతడు 2024లో 27 బంతుల్లో సైప్రస్ జట్టుపై శతకం బాదాడు. 2025లో మహమ్మద్ ఫహద్ (టర్కీ) బల్గేరియాపై 29 బంతులు మూడంకెల స్కోర్ అందుకున్నాడు.

ఇక మొదటి సెమీస్‌లో ఫిన్ అలెన్ రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికాను కివీస్ 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేశారు. ఛేదనలో కివీస్‌ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలో 173 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. టిమ్‌ సీఫెర్ట్ (58)తో కలిసి ఫిన్‌ అలెన్ (100) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా బౌలర్ రబాడ ఒక వికెట్ తీశాడు. గురువారం భారత్-ఇంగ్లాండ్‌ మధ్య జరిగే సెమీస్‌-2 విజేతతో ఆదివారం కివీస్‌ ఫైనల్‌లో ఢీకొట్టనుంది.

Tags:    

Similar News