Arjun Tendulkar Wedding: వేడుకగా సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ వివాహం.. ప్రముఖుల సందడి
Arjun Tendulkar Wedding: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ వివాహం ముంబైలో వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
Arjun Tendulkar Wedding
Arjun Tendulkar Wedding: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల ప్రేయసి సానియా చందోక్‌ను ఆయన పెళ్లాడారు. ముంబైలోజరిగిన ఈ వేడుకకు క్రీడా, రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. గత ఏడాది ఆగస్టులో అతి కొద్దిమంది సమక్షంలో ప్రయివేట్ గా వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ వివాహ వేడుకకు సంబంధించిన సంప్రదాయ వేడుకలు గత కొన్ని రోజులుగా ముంబైలో సందడిగా సాగుతున్నాయి. మార్చి 3వ తేదీన మహాలక్ష్మి రేస్ కోర్స్‌లో అత్యంత వైభవంగా మెహందీ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో టెండూల్కర్ కుటుంబ సభ్యులతో పాటు వారి సన్నిహితులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇక ఈరోజు వివాహ వేడుకలో భారత క్రికెట్ దిగ్గజాల సందడి నెలకొంది. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన భార్య సాక్షితో కలిసి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ప్రస్తుత భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ భార్య విజేత పెంధార్కర్ ఈ వేడుకకు హాజరయ్యారు.
Arjun Tendulkar Wedding: పెళ్లి వేడుకల్లో సచిన్ పాత తరం సహచరులు ఎక్కువగా కనిపించారు. రవిశాస్త్రి, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి వారంతా పెళ్ళికి వచ్చారు. ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ సోదరులతో పాటు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన కుటుంబంతో సహా హాజరై సందడి చేశారు.
మరోవైపు అనిల్ కుంబ్లే, అజింక్య రహానె, సురేష్ రైనా వంటి స్టార్ క్రికెటర్లు కూడా వివాహానికి విచ్చేసి అర్జున్ టెండూల్కర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్, కిరణ్ మోర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
Arjun Tendulkar Wedding: అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఆయన, తనదైన శైలిలో రాణించేందుకు కృషి చేస్తున్నారు. సానియా చందోక్-అర్జున్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సంప్రదాయ బద్ధంగా జరిగిన పెళ్లి వేడుకల్లో సచిన్ టెండూల్కర్ స్వయంగా అతిథులను పేరుపేరునా పలకరిస్తూ ఆహ్వానించారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, క్రికెట్ అభిమానులు కొత్త జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకల వీడియోలు ఇక్కడ చూడొచ్చు..