Glenn Phillips: భారత్‌లో ప్రతిభకు కొదవలేదు.. ఇప్పటికిప్పుడు మూడు టీమ్స్ వరల్డ్‌కప్‌లో ఆడగలవు!
Glenn Phillips: భారత జట్టు ప్రతిభ గురించి న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. భారత్‌లో ఉన్న అపారమైన ప్రతిభ గురించి మాట్లాడిన ఫిలిప్స్.. టీమిండియా క్రికెట్ వ్యవస్థపై ప్రశంసలు కురిపించాడు.
Glenn Phillips: భారత్‌లో ప్రతిభకు కొదవలేదు.. ఇప్పటికిప్పుడు మూడు టీమ్స్ వరల్డ్‌కప్‌లో ఆడగలవు!
Glenn Phillips: భారత జట్టు ప్రతిభ గురించి న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. భారత్‌లో ఉన్న అపారమైన ప్రతిభ గురించి మాట్లాడిన ఫిలిప్స్.. టీమిండియా క్రికెట్ వ్యవస్థపై ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికిప్పుడు భారత్ నుంచి మూడు టీమ్స్ వరల్డ్‌కప్‌లో ఆడగలవని, అన్ని టీమ్స్ టోర్నీ గెలిచే సత్తా ఉన్నవే అని చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. మరోవైపు దక్షిణాఫ్రికాపై గెలిచిన కివీస్.. ఆదివారం టీమిండియాతో తలపడనుంది.
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ నేపథ్యంలో గ్లెన్ ఫిలిప్స్ మాట్లాడుతూ… 'క్రికెట్ పరంగా భారత్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద జట్టు. భారతదేశంలో ప్రతిభకు ఎలాంటి కొరత లేడు. ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. ఒకవేళ భారత్ అనుకుంటే ఈ వరల్డ్ కప్‌లో మూడు వేర్వేరు జట్లను కూడా దింపగలదు. ఆ మూడు జట్లు కూడా టైటిల్ గెలిచే సామర్థ్యం కలిగి ఉంటాయి. అంతమంది ప్లేయర్స్ ఇప్పుడు టీంఇండియాలో ఉన్నారు. ఇందుకు ఐపీఎల్ కారణం. ఐపీఎల్ ద్వారా ఎందరో యువకులు భారత జట్టులోకి వచ్చారు. అందరూ నాణ్యమైన క్రికెట్ ఆడుతారు. ఒత్తిడిలో కూడా జట్టుకు విజయాలు అందిస్తారు' అని ప్రశంసలు కురిపించాడు.
భారత క్రికెట్‌లో ఉన్న టాలెంట్ పూల్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదని గ్లెన్ ఫిలిప్స్ అభిప్రాయపడ్డాడు. దేశంలో ఉన్న బలమైన డొమెస్టిక్ క్రికెట్ వ్యవస్థ, ఐపీఎల్ ద్వారా యువ ఆటగాళ్లకు లభిస్తున్న అవకాశాల కారణంగా ప్రతిభ నిరంతరం వెలుగులోకి వస్తోందని చెప్పాడు. అందుకే భారత జట్టులో ఎప్పటికప్పుడు నాణ్యమైన ఆటగాళ్లు ఉంటున్నారని ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ అత్యంత బలమైన జట్లలో ఒకటిగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ సమతుల్య జట్టుగా భారత్ కొనసాగుతోంది. అందుకే ప్రతి ఐసీసీ టోర్నమెంట్‌లో టీమిండియా టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. ఫిలిప్స్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్ ప్రతిభకు మరో పెద్ద గుర్తింపుగా భావిస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లో భారత్ ప్రభావం ఎంత ఉందో ఈ మాటలు మరోసారి నిరూపించాయి.