PCB: పీసీబీ సంచలన నిర్ణయం.. 13 కొత్త ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్
PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 2025-26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు.
PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 2025-26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు. అయితే, ఈసారి ఏ ఒక్క ఆటగాడు కూడా కేటగిరీ-Aలో లేకపోవడం విశేషం. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి స్టార్ ఆటగాళ్లను కేటగిరీ-A నుంచి కేటగిరీ-Bకి మార్చారు. ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లను చేర్చారు. ఇందులో గతంలో కాంట్రాక్ట్ లేని 13 మంది కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.
పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కొత్తగా చేరిన ఆటగాళ్లలో హసన్ నవాజ్, ఫఖర్ జమాన్, అహ్మద్ డేనియల్, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, హుస్సేన్ తలత్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ మీర్జా, సుఫియాన్ ముకీమ్ ఉన్నారు. యువ బ్యాట్స్‌మెన్ హసన్ నవాజ్ అద్భుతమైన ప్రదర్శనతో మొదటిసారిగా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. సుఫియాన్ ముకీమ్ కూడా మొదటిసారి ఈ జాబితాలో ఉన్నారు.
అలాగే, సీనియర్ పేసర్లు హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ అబ్బాస్ ఫామ్‌లోకి వచ్చి మళ్లీ కాంట్రాక్ట్ సంపాదించుకున్నారు. మహ్మద్ హారిస్, హుస్సేన్ తలత్, ఖుష్‌దిల్ షా కూడా ఈసారి జాబితాలో చేరారు. ఫఖర్ జమాన్ గత ఎనిమిదేళ్లలో మొదటిసారి 2024లో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ, ఇప్పుడు తిరిగి గ్రేడ్-Bలో చోటు సంపాదించుకున్నారు. మరోవైపు, ఆమిర్ జమాల్, కామ్రాన్ గులాం, మీర్ హంజా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, ఉస్మాన్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోలేకపోయారు.
పీసీబీ 2025-26 సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్..
గ్రేడ్ B: అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, మహ్మద్ రిజ్వాన్, సామ్ అయూబ్, సల్మాన్ అలీ ఆగా, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది.
గ్రేడ్ C: అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నౌమాన్ అలీ, సాహిబ్జాదా ఫర్హాన్, సాజిద్ ఖాన్, సౌద్ షకీల్.
గ్రేడ్ D: అహ్మద్ దానియల్, హుస్సేన్ తలత్, ఖుర్రం షెహజాద్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, షాన్ మసూద్, సుఫియాన్ ముకీమ్.