ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి కెఎల్ రాహుల్ రెండో స్థానాన్ని నెలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ 20 సిరీస్‌లో రాణించిన రాహుల్ 823 రేటింగ్ పాయింట్లతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో రాహుల్ 56 యావరేజ్‌తో 224 పరుగులు చేశాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 9వ స్థానం నుంచి పదో స్థానానికి పడిపోయాడు. కివీస్‌తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో ఏకంగా 224 పరుగులు చేశాడు రాహుల్.. ఇక టీ20 బౌలింగ్, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్-10లో ఒక్క భారత బాట్స్ మెన్ లేకపోవడం విశేషం.. జస్‌ప్రీత్ బుమ్రా 630 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు.