RCB vs RR Playing 11: కోహ్లీతో కయ్యానికి సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఆ ఐదుగురికి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన బుడ్డోడు..!

RCB vs RR Playing 11: నేడు గౌహతీలో ఆసక్తికర పోరు జరగనుంది. కోహ్లీతో ఢీ కొట్టేందుకు ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సిద్ధమయ్యాడు.

Update: 2026-04-10 05:59 GMT

RCB vs RR Playing 11

Rajasthan Royals vs Royal Challengers Bangalore: ఐపీఎల్ 2026లో నేడు ఒక ఆసక్తికరమైన పోరు జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు మైదానంలో తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో బుమ్రా వంటి మేటి బౌలర్‌ను ధైర్యంగా ఎదుర్కొన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, నేడు క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సేనను ఎలా ఎదుర్కొంటాడో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

యువ సంచలనానికి అగ్ని పరీక్ష..

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బలమైన బౌలింగ్ విభాగాలను చీల్చిచెండాడుతున్న ఈ యువ ఆటగాడికి, నేడు బెంగళూరు జట్టుతో అసలైన పరీక్ష ఎదురుకానుంది. మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ సమక్షంలో, ఆ ఒత్తిడిని అధిగమించి వైభవ్ తన సహజ సిద్ధమైన ఆటను ఎలా ప్రదర్శిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బుమ్రా బౌలింగ్‌లో అదరగొట్టిన వైభవ్, నేడు మరోసారి సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు.

అందరి చూపు వైభవ్ పైనే..

అంతకుముందు మ్యాచ్ లో మంబై బౌలర్లను ఓ ఆటాడేసుకున్న ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ.. నేడు ఆర్సీబీకి ఓపెన్ ఛాలెంజ్ లా మారాడు. బుమ్రా బౌలింగ్ నే ధీటుగా ఎదుర్కొన్న బుడ్డోడు, నేడు ఆర్సీబీ బౌలర్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడో చూడాలి. బెంగళూరు జట్టులోనూ కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి దిగ్గజ బౌలర్లతోపాటు అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్ వంటి బౌలర్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఎలాంటి బౌలింగ్ తో వైభవ్ దూకుడును అడ్డుకుంటారో చూడాలి.

ఇరుజట్ల విశ్లేషణ..

ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ జట్టు అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ విభాగంగా అవతరించింది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ జోడీ జట్టుకు అదిరిపోయే ఆరంభాలను ఇస్తున్నారు. మరోవైపు రాజస్థాన్ బౌలర్లు కూడా తమ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బెంగళూరు జట్టు విషయానికి వస్తే, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ పొట్టి క్రికెట్ నుంచి వైదొలిగినప్పటికీ, ఐపీఎల్‌లో అతని అనుభవం జట్టుకు కొండంత అండ. జట్టు కూర్పు పరంగా కూడా బెంగళూరు ఎంతో బలంగా కనిపిస్తోంది.

రికార్డుల వేటలో ఓపెనింగ్ జోడీలు..

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్రారంభ బ్యాటర్ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి, వైభవ్ ప్రస్తుతం 12కు పైగా రన్ రేట్‌తో పరుగులు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. వీరు సగటున ప్రతి ఇన్నింగ్స్‌లో అరవైకి పైగా పరుగులు జోడిస్తుండటం గమనార్హం. అదే సమయంలో బెంగళూరు ఓపెనర్లు విరాట్, ఫిల్ సాల్ట్ జోడీ కూడా పదికి పైగా రన్ రేట్‌తో మూడవ స్థానంలో కొనసాగుతున్నారు. పదిహేను ఇన్నింగ్స్‌ల్లో వీరు ఆరు వందల పైచిలుకు పరుగులు సాధించి జట్టుకు వెన్నెముకగా నిలిచారు.

చెన్నై రికార్డుపై బెంగళూరు కన్ను..

ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు జట్టు ఇప్పటివరకు 36 సార్లు రెండు వందల కంటే ఎక్కువ పరుగులు సాధించింది. నేటి మ్యాచ్‌లోరోసారి ఈ మైలురాయిని చేరుకుంటే, అత్యధికంగా 37 సార్లు ఈ ఘనత సాధించిన చెన్నై జట్టు రికార్డును సమం చేస్తారు. ఈ ఉత్కంఠభరిత పోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కేవలం 14 శాతమే ఉండటం క్రికెట్ ప్రేమికులకు ఊరటనిచ్చే అంశం.

తుది జట్ల అంచనా..

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ.

Tags:    

Similar News