Joe Root: జో రూట్ రికార్డుల మోత.. టెస్ట్ క్రికెట్‌లో 38వ సెంచరీ, సంగక్కర సరసన చోటు!

Joe Root: ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో 38వ సెంచరీ సాధించాడు. మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా పై మరోసారి అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు.

Update: 2025-07-26 02:20 GMT

Joe Root: జో రూట్ రికార్డుల మోత.. టెస్ట్ క్రికెట్‌లో 38వ సెంచరీ, సంగక్కర సరసన చోటు!

Joe Root: ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో 38వ సెంచరీ సాధించాడు. మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా పై మరోసారి అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో మ్యాచ్‌ మూడో రోజు జో రూట్ 178 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకుని, శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మెన్ కుమార్ సంగక్కర సరసన నిలిచాడు. అంతేకాదు, ఈ సిరీస్‌లో రూట్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు ఈ సిరీస్ మొదట్లో అంతగా కలిసి రాలేదు. కానీ, లార్డ్స్ టెస్ట్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు మాంచెస్టర్‌లో కూడా సెంచరీ చేసి రూట్ తన పేరు మీద చాలా రికార్డులను నమోదు చేసుకున్నాడు.

మాంచెస్టర్ టెస్ట్ మూడో రోజు, శుక్రవారం జూలై 25న ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను 225 పరుగుల స్కోరుతో మొదలుపెట్టింది. రెండో రోజు ఆట ముగిసేసరికి రూట్ నాటౌట్‌గా ఉన్నాడు. అక్కడి నుంచే తన బ్యాటింగ్ కొనసాగించాడు. మొదటి సెషన్‌లోనే రూట్ తన అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో సెషన్‌లో ఆ హాఫ్ సెంచరీని అద్భుతమైన సెంచరీగా మార్చేశాడు. ఇలా రూట్ టెస్ట్ సిరీస్‌లో తన రెండో సెంచరీని సాధించాడు. తన ఈ సెంచరీ ఇన్నింగ్స్‌లో రూట్ డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానాన్ని కూడా దక్కించుకున్నాడు.

రూట్ సృష్టించిన రికార్డులు ఇవే:

భారత్‌పై అత్యధిక సెంచరీలు: ఇంగ్లండ్‌లో భారత్‌పై జో రూట్‌కు ఇది 9వ సెంచరీ. దీనితో ఒకే దేశంపై సొంత గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ఇప్పుడు రూట్ పేరు మీద ఉంది. అతను దిగ్గజ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మాన్ (8 సెంచరీలు) రికార్డును అధిగమించాడు.

భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు: లార్డ్స్ తర్వాత ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో కూడా రూట్ సెంచరీ సాధించాడు. దీనితో భారత్‌పై టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును రూట్ తన పేరిట లిఖించుకున్నాడు. రూట్‌కు ఇప్పుడు 12 సెంచరీలు ఉన్నాయి, స్టీవ్ స్మిత్ (11 సెంచరీలు) రికార్డును దాటేశాడు.

సంగాకర సరసన రూట్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ రూట్ టెస్ట్ క్రికెట్‌లో తన 38వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. దీనితో శ్రీలంక మాజీ దిగ్గజం కుమార్ సంగక్కర (134 టెస్టుల్లో 38 సెంచరీలు) సరసన నిలిచాడు. రూట్‌కు ఇది 157వ టెస్ట్ మ్యాచ్.

ఒకే టీమ్‌పై అత్యధిక సెంచరీలు: రూట్ ఒకే టీమ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో జాక్ హాబ్స్ , స్టీవ్ స్మిత్ లతో సమానంగా నిలిచాడు. వీరిద్దరూ 12 సెంచరీలు సాధించారు. స్మిత్ ఇంగ్లండ్‌పై, హాబ్స్ ఆస్ట్రేలియాపై ఈ రికార్డును సాధించారు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు: అంతేకాదు, ఈ ఇన్నింగ్స్ సమయంలో రూట్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. రూట్ 120 పరుగులు పూర్తి చేయగానే, అతను రికీ పాంటింగ్, రాహుల్ ద్రావిడ్, జాక్ కల్లిస్ లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి వచ్చాడు. 13379 పరుగులతో అతను ఈ ఘనత సాధించాడు.

Tags:    

Similar News