IPL 2020 | చెన్నైకి మరో ఎదురుదెబ్బ

IPL 2020 | వరుస ఓటములతో అల్లాడుతున్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్ర‌ధాన ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో పూర్తిగా టోర్నీకి దూరమవుతున్నాడు.

Update: 2020-10-21 15:47 GMT

IPL 2020 | చెన్నైకి మరో ఎదురుదెబ్బ

IPL 2020 | వరుస ఓటములతో అల్లాడుతున్న చెన్నైకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్ర‌ధాన ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో పూర్తిగా టోర్నీకి దూరమవుతున్నాడు. మిగిలిన మ్యాచుల్లో డ్వేన్‌బ్రావో ఆడడని ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ ప్రకటించారు. ఈ సీజ‌న్‌లో ఆది నుంచి చెన్నై పేలవ ప్రదర్శన చేస్తోంది. ప‌ది మ్యాచ్‌లాడి కేవలం మూడింట్లోనే గెలుపొందింది. 6 పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. చెన్నై జట్టు గతంలో ఎప్పుడూ ఇంత దుస్థితిలో కనిపించలేదు. జట్టులోని కీలక ఆటగాళ్లంతా గాయాల బారిన పడ్డారు. అక్టోబర్‌ 17న దిల్లీతో జరిగిన మ్యాచులో గాయం కారణంగా బ్రావో ఆఖరి ఓవర్ వేయని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'తొడ కండరాల గాయంతో డ్వేన్‌ బ్రావో మిగిలిన సీజన్‌కు పూర్తిగా దూరం అవుతున్నాడు' అని ఫ్రాంచైజీ సీఈవో విశ్వనాథన్ తెలిపారు. 

ఈ సీజన్‌లో ఆరు మ్యాచులాడిన బ్రావో కేవలం 7 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో మాత్రం రాణించి 8.57 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. ఇప్ప‌టికే చెన్నై.. దాదాపు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి త‌ప్పుకుంది. ఆదిలోనే కీలకమైన సురేశ్‌ రైనా, సీనియర్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ వ్యక్తిగత కారణాలతో దూరమవ్వడంతోనే ఆ జట్టు సమతూకం దెబ్బతినింది. తొలుత బ్రావో సైతం గాయంతో ఆడలేదు. ఆ తర్వాత అంబటి రాయుడు గాయపడ్డాడు. కేదార్‌ జాదవ్‌ ఒక్క మ్యాచులోనూ సరిగ్గా ఆడలేదు.  

Tags:    

Similar News